E-Paper
Advertisement

కారణం లేకుండా కంపెనీ మిమ్మల్ని తీసేయొచ్చా? లేబర్ లా ప్రకారం ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్!

కారణం లేకుండా కంపెనీ మిమ్మల్ని తీసేయొచ్చా? లేబర్ లా ప్రకారం ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్!
Advertisement

Employee termination rights: ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో లేఆఫ్స్ , సడన్ టెర్మినేషన్స్ సర్వసాధారణం అయిపోయాయి.ఏ క్షణంలో ఉద్యోగం ఊడిపోతుందోనని లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని సార్లు బాగా పనిచేసినా ,ఎలాంటి తప్పు చేయకపోయినా మేనేజ్‌మెంట్ కేవలం బడ్జెట్ తగ్గింపు లేదా వ్యక్తిగత కారణాల పేరుతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుంటాయి. కానీ చట్టాల ప్రకారం ఏ కంపెనీ కూడా ఎవరినైనా ఇష్టానుసారంగా, ఎలాంటి బలమైన కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడానికి వీలులేదు. ఇంతకీ లేబర్ లా ఏం చెబుతోంది ? ఉద్యోగికి ఎలాంటి హక్కులు ఉంటాయి అనే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చట్టం ఏం చెబుతోంది?

ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, ఇతర లేబర్ నిబంధనల ప్రకారం, ఒక నిర్దిష్ట ఉద్యోగుల సంఖ్య కలిగిన కంపెనీలు ఉద్యోగిని తొలగించాలంటే తగిన కారణం చూపాలి. కేవలం ‘మాకు మీ సర్వీసులు నచ్చలేదు’ లేదా ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక రోజు ఉదయం వచ్చి జాబ్ నుంచి తీసేయడం నిబంధనలకు విరుద్ధం. పని సరిగా లేదనే సాకుతో తీసేయాలన్నా, కంపెనీ మొదట రాతపూర్వక హెచ్చరికలు ఇవ్వాలి.

Advertisement

నోటీస్ పీరియడ్ , సెవరెన్స్ పే :

ఒకవేళ కంపెనీ నిజంగానే ఉద్యోగిని తొలగించాల్సి వస్తే.. నిబంధనల ప్రకారం కనీసం 1 నుంచి 3 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలి లేదా ఆ నెలల జీతాలను చెల్లించాలి. దీంతో పాటు కంపెనీలో పని చేసిన కాలానికి తగినట్లుగా ‘సెవరెన్స్ పే’అందించాలి. ఇవి ఇవ్వకుండా తొలగిస్తే అది ‘రాంగ్ ఫుల్ టెర్మినేషన్’ కిందకు వస్తుంది.

ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్:

Advertisement

కారణం కోరే హక్కు:

మిమ్మల్ని ఎందుకు తొలగిస్తున్నారో స్పష్టంగా తెలుపుతూ రాతపూర్వక ఉత్తర్వులను కోరే హక్కు మీకు ఉంది.కేవలం మౌఖికంగా చెప్పి బయటికి గెంటడానికి వీలు లేదు.

బకాయిలు, గ్రాట్యుటీ క్లెయిమ్:

మీరు తొలగించిన రోజు వరకు చేసిన పనికి సంబంధించిన జీతం, పెండింగ్ ఉన్న లీవ్ ఎన్‌కాష్‌మెంట్‌లు ,అర్హత ఉంటే గ్రాట్యుటీ మొత్తాన్ని కంపెనీ పూర్తి నష్టపరిహారంతో సహా చెల్లించాలి.

లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం:

కంపెనీ యాజమాన్యం ఏకపక్షంగా, కక్షపూరితంగా లేదా ఎలాంటి కారణం లేకుండా మిమ్మల్ని తొలగిస్తే.. మీరు లేబర్ కోర్టును ఆశ్రయించి నష్టపరిహారం లేదా మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరొచ్చు.

కంపెనీలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భయపడాల్సిన అవసరం లేదు. మీ నియామకపు ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. చట్టపరమైన మీ హక్కుల కోసం ధైర్యంగా నిలబడండి.

Tags

Related News

రూ.5వేల పెట్టుబడితో రూ.5 లక్షలు చేతికి ! సిప్ మ్యాజిక్ ఇదే

కేంద్రంపై వర్తకుల తిరుగుబాటు.. అక్టోబర్ 2న క్యూఆర్ కోడ్స్ పని చేయవు! No UPI Day

స్టాక్ మార్కెట్ భారీ పతనం.. చివరిలో విదేశీ మదుపరులు అమ్మకాలు, అసలు కారణాలు ఇవే

ఆన్‌లైన్ షాపింగ్‌‌కు కొత్త రూల్స్, జనవరి ఒకటి నుంచి అమల్లోకి, ఎట్టి పరిస్థితుల్లోనూ

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

పిపిఎఫ్ vs సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి భవిష్యత్తు కోసం ఏ పథకం ఎక్కువ లాభదాయకం

Big Stories

Advertisement
×