Sai Dharam Tej: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కావడంతో ఈయన బాటలోనే ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలుగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా మెగా హీరోగా, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుప్రీం హీరోగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నటుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు . ప్రస్తుతం ఈయన సంబరాల ఏటిగట్టు సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే సాయి ధరమ్ తేజగా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈయన చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాయి ధరంతేజ్ గతంలో రోడ్డు ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఈయన తీవ్ర గాయాలు పాలయ్యారు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అయితే ఈయనకు రోడ్డు ప్రమాదం(Road Accident)జరిగి ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో ఆ చేదు సంఘటనను మరోసారి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు యాక్సిడెంట్ 5 ఐదు సంవత్సరాలు కావడంతో ఐదేళ్ల తర్వాత కూడా నిలబడే ఉన్నాను పోరాడుతున్నాను అంటూ ఈయన ఒక పోస్ట్ చేశారు.
సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున నాకు నా కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ సపోర్ట్‌తో నాకు జీవితంలో రెండో ఛాన్స్ లభించిందని అన్నారు .మీ సపోర్ట్‌లో ప్రతి ఒక్కటీ నాకు అవసరమైంది. నా గాయాల నుంచి 90% కోలుకున్నా. నా మాట తీరు, మరికొన్ని సవాళ్లతో సహా, నేను ఇంకా కొన్ని విషయాలపై పనిచేస్తున్నాను, కోలుకుంటున్నానని రోజుకొక అడుగు ముందుకు వేస్తున్నానని సాయి ధరంతేజ్ తెలిపారు. నేను మీకు ఒకటే విషయం చెబుతున్నాను మీ ప్రేమ ఎప్పటికీ నన్ను విడిచిపెట్టదు.
THANK YOU ❤️ pic.twitter.com/BGQeSG38iM
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 24, 2026
ఈ క్షణం నాకు కష్టమైందనుకున్న ప్రతిసారి మీ ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుందని, మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మీవల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు లేకపోతే నేను లేను నా ఈ కథ ద్వారా మీ అందరికీ చెప్పేది ఒకటే దయచేసి హెల్మెట్ ధరించండి నా ఆ ఒక్క నిర్ణయమే ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం అయ్యింది. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఈయన యాక్సిడెంట్ గురించి అలాగే ఈ ప్రమాదం నుంచి బయటపడటం గురించి ఎమోషనల్ అవుతూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రమాదం తర్వాత కొంతకాలం పాటు సాయి ధరంతేజ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అనంతరం విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సంబరాల ఏటిగట్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: నాని ది ప్యారడైజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే…స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!