Credit Card Bill: ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు కూడా ATM కార్డుల కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలన్నా, సరుకులు కొనలన్నా, పలువురికి చెల్లింపు చేయలన్నా కూడా వీటినే వాడేస్తున్నారు. దీంతో ప్రతి నెలకు వచ్చే భారీ బిల్లులను చెల్లించలేక అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే, మీరు ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ తర్వాత మాత్రం మీరు ఆ డబ్బు గడువులోగా చెల్లించాలి.
ఒక వేళ మీరు గడువులోపు చెల్లించకుంటే మాత్రం ఆ బిల్లు మొత్తం క్రమంగా పెరిగిపోతుంది. ఎలాగంటే రూ. 40 వేల బిల్లును మీరు మూడు నెలల పాటు చెల్లించకపోతే, అది కాస్తా డబుల్ అయ్యే ఛాన్సుంది. ఆ క్రమంలో మీకు ప్రతి రోజు అనేక ఛార్జీలు వడ్డీల రూపంలో యాడ్ అవుతాయి. దీంతో అనేక మంది భారీగా పెరిగిన వారి క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించలేకపోతారు.
దీంతో వారికి బ్యాంకు సిబ్బంది ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ బిల్లు కట్టాలని వేధిస్తుంటారు. లేదంటే మీరు బ్యాంకులో ఇచ్చిన అడ్రస్ ఆధారంగా మీ ఇంటికి వచ్చి కూడా క్రెడిట్ కార్డ్ బిల్లు గురించి అడిగే అవకాశం ఉంది. కానీ మీరు ఇలాంటి వాటికి భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఏ బ్యాంకు ఉద్యోగి లేదా రికవరీ ఏజెంట్ కూడా మిమ్మల్ని బిల్లు చెల్లింపునకు సంబంధించి బెదిరించడం లేదా దూషించడం చట్ట విరుద్ధం. అలా చేస్తే వారిపై మీరు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకు కస్టమర్‌కు లేదా ఆర్బీఐకి చట్టబద్ధంగా ఫిర్యాదు చేయవచ్చు.
Read Also: 6 Insurance Mistakes: ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ 6 తప్పులు మాత్రం అస్సలు చేయోద్దు
ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పూర్తిగా చెల్లించలేని పక్షంలో మొదట మిమ్మల్ని డిఫాల్టర్‌గా ప్రకటిస్తారు. సెటిల్ మెంట్ కోసం బిల్లు మొత్తం నుంచి ఎంతో కొంత చెల్లించాలని బ్యాంకు వారు మిమ్మల్ని కోరతారు. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది. ఆస్తిని తనఖా పెట్టిన రుణాలలో మాత్రమే వేలం ప్రక్రియలు ఉంటాయి. క్రెడిట్ విషయంలో జైలుకు వెళ్లడం లాంటివి ఉండవు.