Teeth Cleaning Tips: ప్రతి ఒక్కరూ తెల్లగా, మెరిసే, ఆరోగ్యకరమైన పళ్లు ఉండాలని కోరుకుంటారు. మన దంతాలను శుభ్రంగా , బ్యాక్టీరియా లేకుండా ఉంచుకోవడానికి.. మనం వివిధ రకాల టూత్‌పేస్ట్‌లను ఉపయోగిస్తాము. కొన్నిసార్లు టూత్‌పేస్ట్ కూడా పళ్లపై ఉన్న పసుపు రంగును పూర్తిగా శుభ్రం చేయలేకపోతుంది. దీని కారణంగా పళ్లపై పసుపు రంగు పేరుకుపోతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నవ్వడానికి కూడా మనం ఇబ్బంది పడేలా చేస్తుంది.
ఇలాంటి సమయంలోనే పసుపు రంగులోకి మారిన పళ్ల సమస్యను వదిలించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ వాడటం మంచిది. ఇవి చాలా ప్రభావ వంతంగా పని చేస్తాయి. పురాతన కాలంలో పెద్దలు ఉప్పు , ఆవనూనెతో దంతాలను శుభ్రం చేసుకోవాలని సలహా ఇచ్చేవారు. ఈ మిశ్రమం దంతాలను లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మరి ఆవ నూనె, ఉప్పును ఉపయోగించడం వల్ల దంతాలకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.
దంతాలపై పసుపు రంగు:
మీ దంతాలు పసుపు రంగులో ఉంటే.. ఆవ నూనెను ఉప్పుతో కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మిశ్రమం దంతాలపై మరకలు, పసుపు రంగును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిజానికి, ఆవ నూనె సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది దంతాలను లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా పళ్లపై ఉన్న మురికిని తొలగిస్తుంది. ఫలితంగా దంతాలను మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
చిగుళ్ల నొప్పి నుండి ఉపశమనం:
తరచుగా చిగుళ్ళలో నొప్పి, వాపుతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో.. ఉపశమనం పొందడానికి, ఆవ నూనెను ఉప్పుతో కలిపి అప్లై చేయవచ్చు. చిగుళ్ళలో వాపు ఉంటే.. బ్రష్ చేయడాన్ని నివారించండి. ఈ మిశ్రమాన్ని వేలు సహాయంతో చిగుళ్ళు, పళ్లపై రాయండి. ఆవ నూనె చిగుళ్ళను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పంటి నొప్పి, వాపును తగ్గించడంలో ఉపయోగపడతుంది.
బ్యాక్టీరియాను తొలగిస్తుంది :
చాలా మంది బ్యాక్టీరియా వల్ల కలిగే ప్లేక్ సమస్యతో బాధపడుతున్నారు. ప్లేక్ పళ్లపై ఉన్న బయటి పొరను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. అంతే కాకుండా ఇది దంతక్షయానికి కారణమవుతుంది. ఇలాంటి సమయంలో ఆవ నూనె ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది బ్యాక్టీరియాను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చిగుళ్ళ నుండి రక్తస్రావం సమస్యను కూడా తగ్గిస్తుంది. ఆవ నూనెలో ఉప్పు కలపి తరచుగా వాడటం ద్వారా పళ్లపై ఉన్న మురికి ఈజీగా తొలగించవచ్చు.
దంతక్షయం:
కావిటీస్ అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల ఈ సమస్య పెరుగుతుంది.మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఆవ నూనెను ఉప్పుతో కలిపి సమస్య ఉన్న చోట వాడటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మిశ్రమం దంతాల నుండి బ్యాక్టీరియాను తొలగించడానికి, సూక్ష్మజీవులను చంపడానికి, కావిటీస్ నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
నోటి దుర్వాసన నుండి ఉపశమనం:
చాలా మంది నోటి నుండి దుర్వాసన వస్తుంటుంది. ఇది నోరు, దంతాలలో ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆవనూనె ,ఉప్పుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంతే కాకుండా శ్వాస తాజాగా ఉంటుంది.
Also Read: ఇవి ఒక్క సారి వాడినా చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా !
ఎలా ఉపయోగించాలి ?
కొంచెం ఆవ నూనె తీసుకుని దానికి చిటికెడు ఉప్పు కలపండి. మీకు కావాలంటే.. మీరు రాతి ఉప్పును కూడా ఉపయోగించవచ్చు. దీని తరువాత.. ఈ మిశ్రమాన్ని వేలికి తీసుకుని నెమ్మదిగా దంతాలపై మసాజ్ చేయండి. కనీసం రెండు నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత.. మీ నోటిని కాసేపు క్లోజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే.. దంతాలు, చిగుళ్ళకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.