Big Stories

Cars Launched in March 2024: మార్చి నెలలో లాంచ్ అయిన సూపర్ కార్స్ ఇవే.. మీరే ఓ లుక్కేయండి!

March 2024 Cars
March 2024 Cars

Cars Launched in March 2024 in Indian Market: దేశంలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కారులో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంటికేసి రెండు, మూడు కార్లు కూడా ఉంటున్నాయి. కార్ల కంపెనీలు కూడా కొనుగోలుదారులకు మంచి ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తేన్నారు. సులభంగా కార్లను కొనుగోలు చేసే మార్గాలు చూపుతున్నారు. ప్రజలకు కూడా డబ్బును పక్కనపెట్టి.. కార్లను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలోనే అనేక కంపెనీకి చెందిన రకరకాల కార్లు రిలీజ్ అయ్యాయి. అమ్మకాల్లో రికార్డులు నమోదు చేశాయి. ఇందులో అనేక లగ్జరీ కార్లు ,SUV MPV సెగ్మెంట్ వాహనాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. ఏ కంపెనీ ఏ వాహనాన్ని లాంచ్ చేసిందో చూడండి.

- Advertisement -

హ్యుందాయ్ క్రెటా N లైన్

- Advertisement -

క్రెటా ఎన్ లైన్‌ను హ్యుందాయ్ భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ వాహనాన్ని కంపెనీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.82 లక్షల నుండి రూ. 20.45 లక్షల వరకు విడుదల చేసింది. ఇది క్రెటా SUV ఆధారిత స్పోర్టీ వెర్షన్. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడింది.

BYD సీల్

చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD కూడా మార్చి నెలలోనే భారతీయ మార్కెట్లో సీల్ అనే సెడాన్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. కంపెనీ ఈ వాహనాన్ని ప్రీమియం, డైనమిక్  పెర్ఫార్మెన్స్ శ్రేణులలో అందించింది. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇవి వాహనం గరిష్టంగా 650 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. దీని ధర రూ.41 నుంచి 53 లక్షల మధ్యలో ఉంది.

Also Read: మార్కెట్లోకి రానున్న న్యూ బైక్స్.. ఫీచర్స్ చూస్తే ఉంటది..!

టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్

టాటా మోటార్స్ మార్చి నెలలో నెక్సాన్ SUV, ICE ఎలక్ట్రిక్ వెర్షన్లలో డార్క్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. దీని ధర రూ.11.45 లక్షల నుంచి రూ.19.49 లక్షల మధ్య ఉంది. ఈ SUVని కంపెనీ సెప్టెంబర్ 2023లో మాత్రమే ఫేస్‌లిఫ్ట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు దాని డార్క్ ఎడిషన్ తీసుకొచ్చింది

లెక్సస్ LM350h

లగ్జరీ కార్ కంపెనీ లెక్సస్ కూడా మార్చి నెలలో LM350h lexusమోడల్‌ను భారత మార్కెట్లో లగ్జరీ MPVని విడుదల చేసింది. సంస్థ యొక్క ఈ వాహనంలో అనేక గొప్ప ఫీచర్లును తీసుకొచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2 నుండి 2.5 కోట్ల మధ్య ఉంటుంది. నాలుగు, ఏడు సీట్ల ఆప్షన్‌తో దీన్ని తీసుకొచ్చారు.

Also Read: ఇక రేస్ మొదలెడదామ.. లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు!

BMW 620d M స్పోర్ట్ సిగ్నేచర్

మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW కూడా 620d M Sport Signature కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ వాహనాన్ని డీజిల్ ఇంజన్‌తో మాత్రమే విడుదల చేసింది. ఈ లగ్జరీ సెడాన్ కారు ధరను రూ.78.90 లక్షలుగా ఉంచారు.

MG కామెట్ 

దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్ కామెట్‌ను ఫాస్ట్ ఛార్జర్‌తో మార్చి నెలలోనే కంపెనీ విడుదల చేసింది. MG కామెట్ EV లాంచ్ చేసినప్పటి నుంచి 3.3 kW AC ఛార్జర్ మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే తాజాగా కంపెనీ అప్‌గ్రేడ్ చేసి 7.4 kW AC ఛార్జర్ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఆప్షన్ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సి అనే టాప్ రెండు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో కూడిన కామెట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.3 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News