Big Stories

Sports Bikes Launching in 2024: మార్కెట్లోకి రానున్న న్యూ స్పోర్ట్స్ బైక్స్.. ఫీచర్స్ చూస్తే ఉంటది సామి రంగ..!

Sports Bikes
Upcoming Sports Bikes in India 2024

Sports Bikes Launching in 2024 in India: ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నా.. బైక్ రైడింగ్ ఫీల్‌ను బీట్ చేయలేవు. బైక్‌పై ఓ లాంగ్ డ్రైవ్ చేస్తే వచ్చే ఫీలే వేరు. అందుకే మార్కెట్‌లోకి ఏ బైక్ వచ్చినా యువత ఆ బైక్‌ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. బైక్‌ల తయారీ కంపెనీలు కూడా కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ.. పిచ్చెక్కించే లుక్‌, ఫీచర్లతో టూ వీలర్‌లను తీసుకొస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని బైకులు మార్కెట్‌లో దూసుకుపోయేందుకు రెడీగా ఉన్నాయి. వీటి ఫోటోలు ఇప్పటికే నెట్టింట హల్‌చల్ చేస్తుండటంతో బైక్ లవర్స్ ఆ బైకుల గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఆ బైకులు ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -

2024 సంవత్సరంలో చాలా బైకులు మార్కెట్‌లోకి రానున్నాయి. వీటిలో కొన్ని యూత్‌ను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. వీటి ధర గురించి పక్కనపెడితే లుక్ పరంగా మాత్రం అదరకొడుతున్నాయి. వీటిలో ప్రధానమైనది KTM 490 డ్యూక్. ఇది ఒక స్పోర్ట్స్ బైక్. దీనిని ఈ ఏడాది డిసెంబర్‌లో తీసుకురానున్నారు. ఈ బైక్ 450 సీసీ ఇంజిన్ కలిగిన ఉంటుంది. దీని ధర రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. ఇది 490 సీసీ ఇంజిన్‌‌ను కలిగి ఉంది.

- Advertisement -

కవాసకీ కంపెనీ తాజాగా Z400మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. దీనిని రూ.4 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. దీనిని నవంబర్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అలానే మరో లగ్జరీ బైక్‌ల కంపెనీ బెనెల్లీ TNT300 మోడల్ బైక్‌ను తీసుకురానుంది. ఈ బైక్ నవంబర్‌లో రోడ్లపైకి రానుంది. ఇందులో 300 సీసీ ఇంజిన్ ఉంది. దీనిని రూ.3.5 లక్షల తో విక్రయించనున్నారు.

Also Read: ఇక రేస్ మొదలెడదామ.. లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు!

హోండా కూడా కొత్త బైక్‌ను లాంచ్ చేయనుంది. యాక్టివా 7G త్వరలో మార్కెట్‌లోకి రిలీజ్ కానుంది. ఇందులో 110 సీసీ ఇంజిన్‌ను ఉంది. దీని ప్రారంభ ధర రూ. 80 వేల నుంచి రూ.90 వేల మధ్యలో ఉండొచ్చు. ఇది ఏప్రిల్ 15న విడుదల కానుంది. అలానే యూత్ ఫేవరేట్ బైక్ కంపెనీ యమహా తన
ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్‌ను తీసుకురానుంది. ఇందులో 155 సీసీ ఇంజిన్ ఉంది. దీనిని రూ.1.4 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. ఈ బైక్ డిసెంబర్‌లో రావచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News