BigTV English
Advertisement

TCS Layoffs: టీసీఎస్‌లో జాబ్స్ కోల్పోయిన ఉద్యోగులకు లభించేవి ఏమిటీ? సంస్థ ఏం చెప్పింది?

TCS Layoffs: టీసీఎస్‌లో జాబ్స్ కోల్పోయిన ఉద్యోగులకు లభించేవి ఏమిటీ? సంస్థ ఏం చెప్పింది?

12,261మంది ఉద్యోగులపై ఒకేసారి వేటు వేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షాకిచ్చింది. TCS అనేది ప్రైవేట్ కంపెనీ అయినా జాబ్ కి భరోసా ఉంటుందని ఇన్నాళ్లూ అందరూ అనుకున్నారు. కానీ TCS కూడా అన్ని కంపెనీల లాంటిదేనని, తేడా వస్తే తీసిపారేయడానికి ఏమాత్రం మొహమాటపడదని ఇప్పుడు అర్థమైంది. అయితే తొలగింపుల విషయంలో మాత్రం తాము ఉదారంగా ఉంటామని చెబుతున్నారు సంస్థ సీఈఓ K. కృతివాసన్. సిబ్బంది తొలగింపు ఒకేసారి, ఒకేరోజు జరిగిపోదని భరోసా ఇచ్చారు.


అప్పుడే కాదు..
ఉద్యోగుల తొలగింపుపై టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. తమ సంస్థలో 2 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించింది. అంటే 12, 261మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారనమాట. ఈమేరకు బాధిత ఉద్యోగులకు ఆల్రడీ మెయిల్స్ వెళ్లాయి. అయితే వారందర్నీ ఇప్పటికిప్పుడు ఉద్యోగం నుంచి తీసేయడం లేదు. ఏడాది చివరి వరకు ఇది విడతలవారీగా కొనసాగుతుందని చెబుతున్నారు సీఈఓ కృతివాసన్. తొలగించాలనుకుంటున్న ఉద్యోగులతో ఓసారి చర్చలు జరుపుతామని చెప్పారాయన. వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని, కొత్త ప్రాజెక్ట్ లు చూపిస్తామని, అది కూడా సాధ్యం కానప్పుడు చివరకు చేయాల్సింది చేస్తామని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ తొలగింపులు కొనసాగుతాయని చెప్పారు కృతివాసన్.

నోటీస్ పీరియడ్ పే..
ఉన్నట్టుండి ఉద్యోగంలోనుంచి తీసేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు, రోడ్డున పడతారు. అయితే కార్పొరేట్ కంపెనీలు అలాంటి పని చేయవు, ఎందుకంటే వారికి HR నిబంధనలు ఉంటాయి. తొలగించాలనుకుంటున్న ఉద్యోగులకు ముందు నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ కాలానికి వేతనం చెల్లిస్తారు. చివరకు ఫైనల్ సెటిల్మెంట్ ప్రయోజనాలు అందించి వారిని విధుల్లోనుంచి తప్పిస్తారు. ఈ విషయంలో తాము కఠినంగా ఉండబోమని, ఉద్యోగులపై దయతోనే వ్యవహరిస్తామని అంటున్నారు సీఈఓ కృతివాసన్.


తొలగింపులు ఎందుకంటే?
అందరూ అనుకుంటున్నట్టుగా టీసీఎస్ లో తొలగింపులకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం కాదని అన్నారు సీఈఓ కృతివాసన్. ఏఐ ద్వారా 20శాతం పనులు సులభతరం అయ్యాయని చెబుతూనే.. తమ కంపెనీలో తొలగింపులకు వివిధ కారణాలున్నాయని చెప్పారు. స్కిల్ మిస్ మ్యాచ్ అనే పదం వాడారు కృతివాసన్. కొత్త రిక్రూట్ మెంట్ల విషయంలో కూడా తాము ఆలోచిస్తున్నామని అన్నారు. మొత్తమ్మీద కారణం ఏఐ అని చెప్పకపోయినా.. ఐటీ సెక్టార్ లో ఉద్యోగాలు ఊడటానికి అదే ప్రధాన కారణం అని తెలుస్తోంది. అయితే టీసీఎస్ ఈసీఓ మాత్రం ఏఐపై నెపం నెట్టేయలేదు. సర్వీస్ సెక్టార్ లో ఉన్న TCS వంటి పెద్ద కంపెనీలు లాభాల మార్జిన్‌లను కొనసాగించేందుకు, పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడేందుకు ఇలాంటి సాహసాలకు సిద్ధం కాక తప్పడం లేదు. చివరిగా ఇక్కడ ఉద్యోగులే నష్టపోతున్నారు. కంపెనీలు మాత్రం ఒడిదొడుకుల్ని తట్టుకుని ముందుకు సాగుతున్నాయి. టీసీఎస్ లాంటి సంస్థలు ఉద్యోగుల్ని భారీ స్థాయిలో తొలగించడం మాత్రం ఎవరికీ డైజెస్ట్ కావడం లేదు. అలాంటి కంపెనీ ఇలా చేస్తుందా, మరీ ఇంత భారీ స్థాయిలో వేటు వేస్తుందా అని షాకవుతున్నారు. తొలగింపులతోపాటు, కొత్త రిక్రూట్ మెంట్లు కూడా టీసీఎస్ లో ఇప్పుడప్పుడే ఉండవని తెలుస్తోంది.

Related News

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Big Stories

×