Nithya Menon: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఫేవరెట్ హీరోయిన్ అంటే నిత్యామీనన్ అని చెప్తారు. అలా మొదలైంది సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిత్య తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది. తెలుగు ప్రేక్షకులు నిత్యా మీనన్ విపరీతంగా ఇష్టపడతారు. ఎంతలా ఇష్టపడతారు అంటే ఒక టీజర్ లో తన వాయిస్ కాకుండా వేరే వాయిస్ వినిపిస్తేనే చాలామంది ట్రోలింగ్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు.
అంటే నిత్యామీనన్ వాయిస్ కి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాండి రాజ్ దర్శకత్వంలో సార్ మేడం అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా తమిళ్లో మంచి సక్సెస్ సాధించింది. ఆగస్టు ఒకటిన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంది.
వీళ్ళిద్దరూ నన్ను ట్రై చేస్తారు
గత కొన్ని రోజులుగా తమిళ్ మీడియాలో నిత్యమీనన్ పెళ్లి గురించి టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు మీడియా కూడా నిత్య మీనన్ పెళ్లి గురించి టాపిక్స్ తీయడం మొదలుపెట్టారు. దీనికి నిత్యమీనన్ తనదైన రీతిలో సమాధానం చెప్పింది. ఎందుకండీ ఎప్పుడూ పెళ్లి టాపిక్ తీస్తారు అంది. అయితే అలా మాట్లాడుతున్న తరుణంలో దర్శకుడు మరియు విజయ్ సేతుపతి వీళ్లిద్దరూ నన్ను ట్రై చేస్తారు అని పొరపాటున అన్నారు. నిత్యామీనన్ అలా అన్న వెంటనే విజయ్ సేతుపతి ప్రాపర్ గా చెప్పండి అంటూ మాట్లాడారు. ఆ వెంటనే నిత్యామీనన్ అలా కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. నన్ను పెళ్లి చేసుకోమని వీళ్ళిద్దరూ కన్వే చేయడానికి బాగా ట్రై చేస్తారు అని నేను చెప్పాలనుకున్నాను అంటూ అక్కడికక్కడే క్లారిటీ ఇచ్చింది నిత్యా. మొత్తానికి నిత్య ముందు మాట్లాడిన పొరపాటికి స్టేజ్ అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
సినిమా మీద మంచి బజ్
సార్ మేడమ్ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంది. తమిళ్లో ఈ పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఆల్రెడీ కొంతమంది తెలుగు ప్రేక్షకులు తమిళ్ వెర్షన్ చూసేసారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్తో ఆ సినిమా చూడటానికి చాలా మంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇంకా జులై 31న విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంటాయి. ఆ చిత్ర యూనిట్ కి కూడా విజయ్ సేతుపతి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Also Read: Aamir Khan : నాకు 125 కోట్ల అవసరం లేదు, ఆడియన్స్ ఇచ్చే వంద రూపాయలు చాలు