Ajay Devgan – Afridi : సాధారణంగా బాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ క్రేజీ సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2. అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ ప్రదాన పాత్రలో, విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించారు. తన సినిమా విడుదలకు ముందు అజయ్ దేవ్ గన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఆ వివాదం గురించి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది బర్మింగ్ హోమ్ లో జరిగిన వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్ సందర్బంగా అజయ్ దేవ్ గన్ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అప్రిదీని కలిశాడు. అప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియోని ఇప్పుడు ట్రోలింగ్స్ చేస్తున్నారు.
Also Read : Bumrah wife : బుమ్రాకు వెన్నుపోటు…. అతనితో ఎ***ఫైర్ పెట్టుకున్న సంజనా.. కిస్సులు పెడుతూ ?
అఫ్రిదిని కౌగిలించుకున్న అజయ్ దేవ్ గన్..
మరోవైపు భారత్ పై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అజయ్ దేేవ్ గన్ అప్రిదిని కౌగిలించుకోవడం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ కూడా జరిగింది. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత సైన్యం గురించి షాహిద్ అప్రిది ఇండియా పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ తరువాత అప్రిది విజయోత్సవ పరేడ్ నిర్వహించారు. ఈ తరుణంలో అజయ్ తో అప్రిది ఉన్న ఫొటోలు చూసి అజయ్ దేవ్ గన్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్ రద్దు అయింది. జులై 20న బర్మింగ్ హామ్ జరగాల్సి ఉండగా.. టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ బాయ్ కాట్ చేశారు. అజయ్ దేవ్ గన్ ఈ టోర్నమెంట్ కి సహ యజమాని కావడంతో ఎడ్జ్ బాస్టన్ లో గత ఏడాది ప్రారంభ సీజన్ లో పాల్గొన్నారు.
సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీకి ఎఫెక్ట్
తొలి సీజన్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి.. ఇరు దేశాల మద్య ఉద్రిక్తతల కారణంగా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాకిస్తాన్ లో నిర్వహిస్తే.. భారత్ మాత్రం పాక్ లో ఆడలేదు. భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గతంలో షాహిద్ అప్రిది ని కలిసిన అజయ్ దేవ్ గన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీకి ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను జులై 25న థియేటర్లలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్రకటించినప్పటికీ.. తాజాగా ఈ మూవీని వాయిదా వేశారు. ఆగస్టు 1 కి పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం.. అభిమానులు కాస్త నిరాశ చెందినప్పటికీ సినిమా పై మాత్రం ఆసక్తి తగ్గలేదు.
Old photos of #AjayDevgn are suddenly being dug up and circulated online, all in an attempt to spread negativity around #SonOfSardaar2.
It’s clearly a planted move, most likely backed by a PR agency’s paid IT cell trying to create a fake narrative just before the release. pic.twitter.com/KfED5Lhchq
— OM (@omfilmzz) July 20, 2025