Citroen Basalt SUV Coupe Launched: ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ ఇండియా తాజాగా దేశీయ మార్కెట్‌లో తన లైనప్‌లో ఉన్న ఒక కొత్త ఎస్యూవీని లాంచ్ చేసింది. అదే బసాల్ట్ కూపే ఎస్యూవీ. దేశీయ మాస్-మార్కెట్ సెగ్మెంట్‌లో లాంచ్ అయిన తొలి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసిఈ) వెర్షన్‌గా బసాల్ట్ కూపే ఎస్యూవీ చరిత్ర సృష్టించింది. కంపెనీ దీనిని కేవలం రూ.7.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసింది. సిట్రోయిన్ దీనిని 5వ ప్రొడక్స్‌గా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కంపెనీ ఇందులో నాలుగు మోడళ్లను తీసుకువచ్చింది. అవి సీ5 ఎయిర్‌క్రాస్, సీ3, ఈసీ3, సీ3 ఎయిర్‌క్రాస్ వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక కొత్తగా లాంచ్ అయిన బసాల్ట్ కూపే ఎస్యూవీ ఇంజిన్ విషయానికొస్తే.. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 80 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యుస్ చేస్తుంది. మరొకటి 1.2 లీటర్ మూడు సిలిండర్ల, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 109 బిహెచ్‌పి పవర్‌ను అందిస్తుంది. టర్బో ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లో 205 ఎన్ఎమ్ టార్క్‌ని విడుదల చేస్తుంది.
Also Read: టాటా కర్వ్‌కి పోటీగా సిట్రోయెన్ బసాల్ట్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!
కాగా దీని 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ లీటర్‌కు 18 కి.మీ మైలేజీ అందిస్తుంది. అదే సమయంలో 1.2 టర్బో పెట్రోల్ మాన్యువల్ ఇంజిన్ లీటర్‌కు 19.5 కి.మీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లీటర్‌కు 18.7 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఈ బసాల్ట్ కూపే ఎస్యూవీలో 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ర్యాప్ రౌండ్ టెయిల్‌లైట్స్‌తో సహా మరిన్ని ఉన్నాయి. అలాగే వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడి 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
ఇందులో ఆరు స్టాండర్స్ ఎయిర్‌బ్యాగ్స్‌లు ఉన్నాయి. ఈఎస్‌పీ, పార్కింగ్ సెన్సార్లతో రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ బసాల్ట్ కూపే ఎస్యూవీ మొత్తం 7 కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి పోలార్ వైట్, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, స్టీల్ గ్రే, గార్నెట్ రెడ్ వంటి కలర్లను పొందుతుంది. కాగా దీని ఇంటీరియర్ టిఎఫ్‌టీ డిస్‌ప్లే థీమ్స్ వాహనప్రియులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి.