Man Applies 1000 Jobs AI | ఏఐ వచ్చిన తర్వాత మనుషుల ఉద్యోగాలు పోతాయని చాలామంది ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో అదే ఏఐని ఉపయోగించుకొని ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకున్నాడో వ్యక్తి. ఆ కథ ఎలా ముగిసిందో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుత ఏఐ యుగంలో చాలామంది సొంత ఏఐ బోట్స్ తయారు చేసేసుకొని, చాలా అవసరమైన పనులు చేయించుకుంటున్నారు. కొందరు రిజ్యూమ్స్ తయారు చేసుకుంటుంటే, మరికొందరు కవర్ లెటర్స్ రాయించుకుంటున్నారు. మరికొన్ని ఏఐ బోట్స్‌తో మెమొరాండమ్స్ వంటి డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించుుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఉద్యోగాలకు అప్లై చెయ్యడం కోసం ఏకంగా ఒక ఏఐ బోట్‌ను తయారు చేశాడు.
ఈ బోట్ పని ఒకటే.. ఆన్‌లైన్‌లో కనిపించే ఉద్యోగాలను చెక్ చెయ్యడం, వాటికి సరిపోయే విధంగా రిజ్యూమ్స్ తయారు చేసి, ఆ ఉద్యోగాలకు అప్లై చెయ్యడమే. ఈ జాబ్స్‌కు కావలసిన అర్హతలను బట్టి, దానికి సరిపోయే రిజ్యూమ్‌ను రెడ చేసి, జాబ్‌కు అప్లై చేస్తుంది. దీన్ని తయారు చేసిన ఆ వ్యక్తి.. ఈ ఏఐ యూజ్ చెయ్యడం వల్ల వచ్చిన ఫలితాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
రెడిట్‌లో ఆ యువకుడు తన కథను షేర్ చేశాడు. అతను స్వతహాగా రెడీ చేసిన ఏఐ, తను నిద్రపోతున్న సమయంలో కూడా ఉద్యోగాలను సెర్చ్ చేసి అప్లై చేస్తుందని చెప్పాడు. ఇలా వెయ్యికిపైగా ఉద్యోగాలకు ఏఐ దరఖాస్తులు చేసిందని వెల్లడించాడు.
Also Read: ఇంట్లో దొంగతనానికి వెళ్లి మహిళను ముద్దాడిన దొంగ.. ఎలా పట్టుకున్నారంటే..
దీంతో ఒక నెలలోనే తనకు 50 కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయని ఆ వ్యక్తి చెప్పాడు. ఒక్కో జాబ్‌కు ప్రత్యేకమైన సీవీలు, కవర్ లెటర్స్ పంపడం వల్లనే ఇది సాధ్యమైందని ఆ వ్యక్తి చెప్పాడు. ఆటోమేటిక్ స్క్రీనింగ్‌ను పాస్ చెయ్యడానికి ఇలాంటి పద్ధతి చాలా ఉపయోగపడుతుందన్నాడు. ఇలా టైలర్ మేడ్ సీవీలు, రిజ్యూమ్స్ పంపడం వల్ల అటు ఏఐలు, ఇటు మనుషులు నుంచి కూడా చాలా త్వరగా రిప్లైలు వస్తాయని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే ఇలా టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఉద్యోగ ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయని అతను అభిప్రాయపడ్డాడు.
ఇది విన్న చాలామంది నెటిజన్లు.. ఈ పద్ధతి ఏదో బాగుందే? అని అంటున్నారు. అయితే దీని వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయని ఆ నెటిజన్ చెప్పాడు. ఈ పరిస్థితిని వివరిస్తూ.. ఇలా ఆటోమేటిక్‌గా జాబ్స్ అప్లికేషన్స్ క్లియర్ అవడం వల్ల జాబ్స్ చాలా త్వరగా ఫిల్ అయ్యే అవకాశం ఉందని, ఇలా జరగడం మంచిదేనని ఆ వ్యక్తి అన్నాడు.
కానీ, అలా చెయ్యడం వల్ల వృత్తిపరంగా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నాడు. ఉద్యోగాలు ఇచ్చే సమయంలో మనుషుల మధ్య సంభాషణలు, ఇంటరాక్షన్ వల్ల ఒక బంధం ఏర్పడుతుందని, అది కూడా పోతుందని చెప్పాడు. ఇలా జరగడం వర్క్ ఎన్విరాన్‌మెంట్‌కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. మరి మీరేమంటారు?