India Gold Mining: భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మగువలకు బంగారం అంటే చాలా ఇష్టపడుతారు. బంగారం ధరలు ఒక్కసారిగే తగ్గితే.. వాళ్లకున్నంతా సంబురం ఇంకెవరికి ఉండదు. కాకపోతే గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. తులం బంగారం రూ.లక్ష ఉందంటే.. ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ సామాన్యుడి బంగారం కొనాలంటే భయపడిపోతున్నాడు. అయితే మన దేశంలో బంగారు గనులు ఎక్కడ ఉన్నాయి? ఏ రాష్ట్ర నుంచి బంగారం ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది? మన తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో బంగారు గనులు ఉన్నాయి? అనే దాని గురించి మనం సవివరంగా తెలుసుకుందాం.
దేశంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా బంగారు గనులు ఉన్నాయి. కర్నాటక రాష్ట్రంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, హుట్టి, గంజుర్ బంగారు గనులు ఉన్నాయి. ఒడిశాలో సుందర్ గఢ్, నబరంగ్ పూర్, కియోంజర్, దియోగఢ్ ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలో మరి కొన్ని ప్రాంతాల్లో కూడా బంగారు గనుల శోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 550కి పైగానే పనిచేసే బంగారు గనులు ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉన్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కర్నాటకలో 41 ప్రభుత్వ రంగ గనులు, 232 ప్రైవేట్ రంగ గనులు ఉన్నాని అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా కర్నాటకలో కోలార్ బంగారు గనులు (కేజీఎఫ్), హుట్టి బంగారు గనులతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారు గనుల తవ్వకం జరుగుతోంది. ఇవి దేశంలోనే అత్యంత ప్రఖ్యాతగాంచినవి. కోలార్ బంగారు గనులు కర్నాటక రాష్ట్రంలోన అత్యంత పురాతనమైన బంగారు గనుల్లో ముఖ్యమైనవి. కోలార్ గనుల్లో అత్యంత ఎక్కువగా బంగారం ఉత్పత్తి అవుతోంది. అలాగే రాయచూర్ జిల్లాలో ఉన్న హుట్టి బంగారు గనులు కూడా ఫేమస్. ఇది దేశంలోనే పెద్ద బంగారు గనిగా గుర్తింపు ఉంటుంది.
ALSO READ: Gold Mining: మన తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల నిల్వలు గుర్తింపు
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. కర్నూలుతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్నిచోట్ల బంగారం గనులను అధికారులు గుర్తించారు. వాటిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి పసిడిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్ ఆసక్తిగా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ.. 2013లోనే జొన్నగిరి మండలంలో బంగారాన్ని కనుక్కునేందుకు ట్రయల్స్ ప్రారంభించేందుకు ప్రైమరీ లైసెన్స్‌ను పొందింది. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కోసం మరిన్ని అనుమతులు అవసరం కాగా.. అందుకోసం దాదాపు దశాబ్దానికి పైగా సమయం పట్టింది. అలా.. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి 2021లో బంగారు మైనింగ్ ట్రయల్స్ ప్రారంభించింది.
ALSO READ: Fake Gold: మార్కెట్లోకి ఫేక్ బంగారం.. గుర్తించకపోతే బుక్కైపోతారు
జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్, రాంచీ, హీరాబుద్ది, కేంద్రుకోచా ప్రాంతాల నుంచి బంగారాన్ని వెలికి తీస్తున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్, సుందర్‌గఢ్ జిల్లాలు కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా, ఉదయపూర్ ప్రాంతాల్లో కొంత మేర బంగారు గనులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్, సోనాఖాన్ ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిరంతరం పరిశోధనలు చేస్తోంది. కర్ణాటక, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బంగారు ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి.