SUVs Discount In September : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే పండగ సీజన్ మొదలైపోయింది. దీంతో ప్రముఖ బ్రాండెడ్ కార్ల తయారీ కంపెనీలు తమ మోడళ్లపై కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్లు అందించి అదరగొట్టేస్తున్నాయి. తమ కార్ల సేల్స్ పెంచుకోవడానికి భారీ తగ్గింపులు ప్రకటించి ఆసక్తి రేపుతున్నాయి. అందులో ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, మారుతి, మహీంద్రా, కియా, జీప్‌తో పాటు మరెన్నో కార్ల తయారీ కంపెనీలు తమ మిడ్ రేంజ్ ఎస్యూవీలపై ఊహించని డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెలలో అంటే సెప్టెంబర్‌లో పలు కంపెనీలు అందిస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
Jeep Compass
జీప్ కంపెనీ తన జీప్ ఇండియా కంపాస్‌పై ఎవ్వరూ ఊహించని డిస్కౌంట్‌ను ప్రకటించింది. దాదాపు రూ.3.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌లో దాదాపు రూ.2.5 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. కాగా ఈ కంపాస్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో రూ.18.99 లక్షల నుండి రూ.28.33 లక్షల ధర మధ్య లభిస్తుంది.
Jeep Meridian
Jeep Meridianపై కూడా కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. జీప్ మెరిడియన్ కారుపై దాదాపు రూ.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ కారు 7సీటర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది రూ.30 లక్షల నుంచి రూ.37.14 లక్షల ధర మధ్య లభిస్తుంది.
Maruti Grand Vitara
ఎంతో ప్రజాదరణను సొంతం చేసుకున్న మారుతు సుజుకి.. ఇప్పుడు తన గ్రాండ్ విటారా పై డిస్కౌంట్ ప్రకటించింది. తన గ్రాండ్ విటారాలోని స్ట్రాంగ్ హైబ్రిడ్ పై రూ.1.28 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా తన మైల్డ్ హైబ్రిడ్ లైనప్ పై రూ.73,100, సీఎన్జీ వేరియంట్లపై రూ.33,100 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
Also Read: భారతదేశంలోని టాప్ 5 వేగవంతమైన రైళ్లు.. స్పీడ్‌లోనే కాదు, లగ్జరీలోనూ తోపే!
Mahindra XUV400
ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ కార్ల కంపెనీ ఏదన్నా ఉంది అంటే అది మహీంద్రా అనే చెప్పాలి. ఈ కంపెనీ తాజాగా తన Mahindra XUV400 మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందించింది. దీని టాప్ స్పెక్ EL PRO వేరియంట్‌పై రూ.3 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. ఇక దీని ధర విషయానికొస్తే.. ఇది రూ.16.74 లక్షల నుంచి రూ.17.49 లక్షల ధర మద్య లభిస్తుంది.
Tata Safari
దేశీయ మార్కెట్‌లో టాటా కార్లకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంది. అందులో ముఖ్యంగా టాటా సఫారీ కార్లను ఎక్కువ మంది కొనేస్తున్నారు. ఇంకా తన కార్ల సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ తాజాగా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. టాటా సఫారీ కార్లపై దాదాపు రూ.50,000 నుంచి రూ.1.4 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందులో MY 2023 వేరియంట్‌పై రూ.25,000 ఎక్స్‌ట్రా క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. దీని ధర విషయానికొస్తే.. ఇది రూ.15.49 లక్షల నుంచి రూ.27.34 లక్షల మధ్య ఉంటుంది.
Tata Harrier
అలాగే టాటా మోటార్ లైనప్‌లో ఉన్న మరో కారు Tata Harrier. దీనిపై కూడా కంపెనీ తగ్గింపు ప్రకటించింది. దాదాపు రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. MY 2023 వేరియంట్‌పై రూ.25,000 తగ్గింపు పొందొచ్చు. ఇక దీని టాప్ వేరియంట్‌లపై రూ.70,000 నుంచి రూ.50,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇది రూ.14.99 లక్షల నుంచి రూ.26.44 లక్షల మధ్యలో ఉంది.
Volkswagen Tiguan
Volkswagen Tiguan పై కూడా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఈ మోడల్‌లో వేరియంట్‌ను బట్టి రూ.3.07 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. అందులో MY 2023 టైగన్ 1.5 జిటి ఇన్వెంటరీపై గరిష్ట డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే MY 2024 టైగన్స్ 1.0 లీటర్ ఇంజిన్ మోడల్‌పై రూ.60,000 నుంచి రూ.1.25 లక్షల వరకు భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక దీని ధర విషయానికొస్తే.. ఇది రూ.11.70 లక్షల నుంచి రూ.20 లక్షల ధర మద్య ఉంటుంది.
Also Read: ఈ ఎలక్ట్రిక్ కారుపై లక్షల్లో డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ రాదు బ్రో..!
Kia Seltos
కియా కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందులో కియా సెల్టోస్ భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సెల్టోస్‌పై కంపెనీ డిస్కౌంట్‌లు ప్రకటించింది. దాదాపు రూ.1.3 లక్షల వరకు డిస్కౌంట్లు పొందొచ్చు. ఈ తగ్గింపులు క్యాష్ డిస్కౌంట్, యాక్ససరీస్ ప్యాకేజీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లకు వర్తిస్తాయి. ఇది రూ.10.90 లక్షల నుంచి రూ.20.37 లక్షల ధర మధ్య ఉంటుంది.
Honda Elevate
హూండా కార్ల తయారీ సంస్థ తన ఎలివేట్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి రూ.75,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో ఏప్రిల్ తర్వాత రూపొందిన ఎస్యూవీలపై రూ.65,000 ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇది రూ.11.91 లక్షల నుంచి రూ.16.51 లక్షల ధర మధ్యలో ఉంది.
Hyundai Alcazar
హ్యుందాయ్ కూడా పలు ఆఫర్లతో దూసుకుపోతుంది. తాజాగా సెప్టెంబర్ నెలలో తన అల్కాజర్ మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీని ఫేస్ లిఫ్ట్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ కావడంతో అవుట్ గోయింగ్ మోడల్‌పై రూ.90,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.