డిమార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దేశంలోని ప్రముఖ రిటైల్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా 350కి పైగా స్టోర్లు ఉన్నాయి. ప్రతి రోజు లక్షలాది మంది కస్టమర్లకు కావాల్సిన వస్తువులను అందిస్తుంది. కిరాణా సరుకుల నుంచి గృహోపకరాణాల వరకు అన్ని వస్తువులను అగ్గువకే అందిస్తుంది. చౌక ధరల్లో క్వాలిటీ వస్తువులను అందించడంలో డిమార్ట్ ముందుంటుంది. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని డిమార్ట్ తన వ్యాపార రంగాన్ని విస్తరిస్తుంది. ఒకప్పుడు మెట్రో నగరాలకు పరిమితమైన డిమార్ట్ సేవలు ఇప్పుడు చిన్న పట్టణాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి.
ఇక డిమార్ట్ కంపెనీ కస్టమర్లకు తక్కువ ధరలకే మంచి వస్తువులు అందించినట్లు, తమ స్టోర్లలో పని చేసే ఉద్యోగులను కూడా ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. చక్కటి జీతంతో పాటు అనే అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. కంపెనీ తీసుకుంటున్న ఎంప్లాయీ ఫ్రెండ్లీ విధానాలతో స్టోర్లలో పని చేసేందుకు చాలా మంది యువకులు ఆసక్తిచూపిస్తున్నారు. “మా ఉద్యోగులు మా కుటుంబ సభ్యులతో సమానం. వారికి పనికి తగిన సాలరీ ఇవ్వడం మా బాధ్యత.ప్రతి ఉద్యోగికి తన జీతంతో పాటు EPF రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది. కంపెనీ నుంచి జీతంలో 12 శాతం EPF ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది ఉద్యోగ విరమణ పొందిన భారీ పొదుపును అందిస్తుంది. 5 సంవత్సరాలకు పైగా తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు అదనపు గ్రాట్యుటీ బోనస్ లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మొత్తం లక్షల్లో ఉంటుంది” అని డిమార్ట్ సీఈవో నవిల్ నోరోన్హా వెల్లడించారు.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?
అటు పనితీరు ఆధారిత ఉద్యోగుల వార్షిక బోనస్ అనేది DMart అందించే మరో ముఖ్యమైన బెనిఫిట్. గత సంవత్సరం ఉద్యోగులకు సగటున 15 నుండి 20 శాతం బోనస్ పంపిణీ చేసింది. అదనంగా, హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కింద DMart తమ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు కవరేజీని అందిస్తోంది. మెడికల్ ఎమర్జెనసీ సమయంలో ఈ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపుతుంది.
ఇక డిమార్ట్ స్టోర్ నుంచి సరుకులు కొనుగోలు చేసే ఉద్యోగులకు 10 నుంచి 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వారు నెలవారి ఖర్చులో ఎక్కువ పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, డిజిటల్ అమ్మకాలు, కస్టమర్ సేవ, లీడర్ షిప్ నైపుణ్యాలను అందించేందుకు ప్రత్యేక శిక్షణను ఇస్తోంది కంపెనీ. చాలా మంది ఉద్యోగులు సేల్స్ అసిస్టెంట్ నుంచి మేనేజర్ స్థాయి వరకు ఎదిగారు. ఇంకా చెప్పాలంటే, ఒక ఉద్యోగి DMartకి వచ్చినప్పుడు, అతను ఉద్యోగం పొందడమే కాకుండా సురక్షితమైన భవిష్యత్తును కూడా పొందుతాడు. ఒకవేళ మీకు సమీపంలో ఉన్న ఏమైనా ఖాళీలు ఉంటే వెంటనే ట్రై చేయడం బెస్ట్ అంటున్నారు నిపుణులు.
Read Also: డిమార్ట్ చాటున బడా మోసం.. ఇలా చేశారంటే మీ డబ్బులన్నీ లూటీ!