E-Paper
Advertisement

14 ఏళ్లకే AI స్టార్టప్ పెట్టేసిన బుడ్డోడు.. ఏకంగా బుర్జ్ ఖలీఫాలో ఆఫీసు, అతడు ఏం చేస్తాడంటే?

14 ఏళ్లకే AI స్టార్టప్ పెట్టేసిన బుడ్డోడు.. ఏకంగా బుర్జ్ ఖలీఫాలో ఆఫీసు, అతడు ఏం చేస్తాడంటే?
Advertisement

Zainam Jain: దేశవ్యాప్తంగా యంగ్ టెక్ బిజినెస్‌మేన్‌గా జైనమ్ జైన్ పేరు మార్మోగుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏకంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ఆఫీసు ఏర్పాటు చేశాడు? ఎవరీ జైనమ్ జైన్? చిన్న వయస్సులో టెక్ రంగంలోకి ఎలా ఎంటరయ్యాడు? ఈ స్టోరీలోకి లోతుగా వెళ్దాం.

14 ఏళ్లకే AI స్టార్టప్ పెట్టేసిన బుడ్డోడు

Advertisement

జైనమ్ జైన్.. ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. భారత్‌కు చెందిన ఈ యువకుడి వయస్సు కేవలం 14 ఏళ్లు. చిన్న వయసులో ఏఐ స్టార్టప్‌ను నిర్మించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆ బాలుడి వయసుకు  చాలామంది చదువు, వినోదంపై దృష్టి పెడతారు. ఇప్పటికే జైనమ్.. సాంకేతిక-వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టేశాడు. మెంగో ఇంజిన్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని ప్రారంభించాడు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తన వ్యాపారానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో మెంగో ఇంజిన్‌ను స్థాపించాడు. ఏఐ-ఆధారిత పరిష్కారాలను ఉపయోగించి మార్కెటింగ్ వ్యూహాలు, కస్టమర్లను చేరుకోవడం, వ్యాపార వృద్ధిని మెరుగుపరిచే సాధనాలపై దృష్టి పెట్టడం.  కేవలం ఒక ప్రాజెక్ట్‌కే పరిమితం కాకుండా తన అభ్యాసాన్ని విస్తరించుకోవడానికి కృషి చేశాడు.

Advertisement

స్టార్టప్‌ను అభివృద్ధి చేస్తూనే టెక్నాలజీ, వ్యాపారంలోని వివిధ రంగాలను అన్వేషించాడు. ఇంతకీ యంగ్ టెక్ బిజినెస్‌మేన్ ఆఫీసు ఎక్కడో తెలుసా? ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలోని 141వ అంతస్తులో తన ఆఫీసుని ఏర్పాటు చేశాడు. జైనం ఇప్పటికే అనేక విజయాలను సాధించాడు. రెండు పేటెంట్ హక్కులను సొంతం చేసుకున్నాడు. మరిన్ని పురోగతిలో ఉన్నాయి.

బుర్జ్ ఖలీఫాలో ఆఫీసు ప్రారంభించిన జైనమ్ జైన్

ఓ పుస్తకం రాశాడు, 1,45 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లతో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నాడు. చిన్నప్పటి నుంచే అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. కేవలం పదేళ్ల వయస్సులో పుస్తకాలు చదవడం, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలకు హాజరుకావడం చేశాడు. అదే క్రమంలో దేశమంతా పర్యటించాడు. ప్రముఖుల మొదలు ప్రజల వరకు వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు.

కేవలం 13 ఏళ్ల వయసులో 10వ తరగతికి సమానమైన IGCSE పరీక్ష పూర్తి చేశాడు. చదువుకు విరామం ఇచ్చి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. జైనమ్ ఎలాంటి AI కోర్సులు చదవలేదు. కేవలం యూట్యూబ్ వీడియోలు చూడటం, ఆన్‌లైన్ టూల్స్ ఉపయోగించడం, సొంత ప్రయోగాల ద్వారానే కోడింగ్, AI టెక్నాలజీని ఒడిసి పట్టేశాడు. చిన్న వయసులో వ్యాపారం పట్ల తన ఆసక్తి మొదలైందని చెప్పాడు.

అది కూడా కేవలం ఆరేళ్ల వయసులో.  దానివల్ల కంపెనీలు ఎలా పని చేస్తాయనే దానిపై అవగాహన కలిగిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో తన ప్రయాణం, ప్రపంచ అనుభవాల గురించి వివరించాడు. 13 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్ష పాస్ అవ్వాలనే సవాల్‌ను స్వీకరించాడు.  సొంతంగా ఏదైనా నిర్మించాలనే ఆసక్తిని పెంచుకోవడానికి అది అతడికి సహాయపడింది.

ALSO READ: రియల్ ఎస్టేట్ బూమ్.. దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరు.. 19 శాతం పెరుగుదల, హైదరాబాద్‌ మాటేంటి?

చిన్న వయసులో వ్యాపార ఆలోచనలతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని బుర్జ్ ఖలీఫాలో అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు జైనమ్ జైన్. 14 ఏళ్ల బాలుడి గురించి ఓ నెటిజన్ ఈ విధంగా రాసుకొచ్చాడు.

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా 141వ అంతస్తులో 14 ఏళ్ల జైనమ్ కార్యాలయం ఉంది. ఆకట్టుకున్నది ఆ కార్యాలయం కాదు.. అతని ఆలోచనా విధానమని రాసుకొచ్చాడు. తగినంత వయసు వచ్చే వరకు వేచి ఉండలేదు.. నేర్చుకున్నాడు.. నిర్మించాడు.. తన జ్ఞానాన్ని పంచుకుంటున్నాడు.. నిరంతరం ముందుకు సాగాలని రాసుకొచ్చాడు. సోషల్‌మీడియాలో జైనమ్ జైన్ సెలబ్రిటీగా మారిపోయాడు.

Related News

హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్స్‌.. బుకింగ్ మొదలు, రూ.62 కోట్లకు పెంట్‌హౌస్‌

షాకిచ్చిన బంగారం-వెండి ధరలు.. ఒక్కరోజు 10 వేలు, మార్కెట్లో ఇవాళ మాటేంటి?

ఇంటర్వ్యూలో కళ్లుమూసుకుని సమాధానం చెప్పాలి.. షాక్ అయిన ఏఐ ఇంజనీర్

లోదుస్తుల గుట్టు బయటకు.. ఇండియా బిగ్గెస్ట్ మార్కెట్, ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా?

షాకిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. బుధవారం నుంచి వడ్డీ రేట్ల పెంపు, భారం ఎవరికి?

ప్రతి నెలా రూ.5000 పెట్టుబడి ప్లాన్ చేస్తున్నారా? FD లేదా SIP ఏది బెస్ట్

ఐటిఆర్ ఫైల్ చేసినా ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందా? దీనికి 3 కారణాలు ఇవే

దిగొచ్చిన బంగారం ధర.. మరి తెలుగు రాష్ట్రాల ధరల మాటేంటి?

Big Stories

Advertisement
×