E-Paper
Advertisement

రోజూ అంట్లు తోమి విసిగిపోయారా? ఈ డిష్‌వాషర్లు కొంటే.. మీ కష్టాలన్నీ తీరినట్లే!

రోజూ అంట్లు తోమి విసిగిపోయారా? ఈ డిష్‌వాషర్లు కొంటే.. మీ కష్టాలన్నీ తీరినట్లే!
Advertisement

Best Dishwashers: కిచెన్ లో అంట్లు తోమడం అనేది మహిళలకు ఎప్పుడూ సవాలుతో కూడుకొని ఉంటుంది. జిడ్డు, మసాలాలతో నిండిన పాత్రలను చేత్తో తోమడానికి ఎంతాగానో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రస్తుతం ఎన్నో రకాల డిష్ వాషర్లు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా డిష్ వాషర్ కొనాలని భావిస్తున్న వారికి.. దేశంలోనే టాప్ -5 లిస్ట్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. దేశీయ కిచెన్ కు అనుగుణంగా వచ్చి పడే పాత్రలను ఇవి క్షణాల్లో క్లీన్ చేసేస్తాయి. ఇంతకీ ఆ డిష్ వాషర్లు ఏవి? వాటి ప్రధాన ఫీచర్లేంటో ఈ కథనంలో చూద్దాం.

Bosch SMS66GI01I

దేశీయ డిష్‌వాషర్ల మార్కెట్ లో ‘బాష్’ బ్రాండ్‌కు తిరుగులేని గుడ్ విల్ ఉంది. ముఖ్యంగా ‘బాష్ SMS66GI01I’ మోడల్.. దేశీయ కిచెన్ లకు సరిగ్గా సరిపోతుంది. ఇది 70 డిగ్రీల సెల్సియస్ వేడి నీటితో గిన్నెలను కడుగుతుంది. దీనివల్ల కడాయిలు, ప్యాన్‌లకు ఉండే మొండి, జిడ్డు, నూనె మరకలు పూర్తిగా తొలగిపోతాయి. 13 ప్లేస్ సెట్టింగ్స్ సామర్థ్యంతో వచ్చే ఈ మోడల్.. పెద్ద కుటుంబాలకు ఎంతో అనుకూలమైనది. అమెజాన్ లో ఇది 22 శాతం రాయితీతో రూ.47,590 అందుబాటులో ఉంది.

Electrolux UltimateCare 700

Advertisement

అత్యాధునిక ఫీచర్లు కలిగిన డిష్ వాషర్ కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. గిన్నెలకు ఎలాంటి గీతలు పడకుండా ఇది చకచకా శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా గాజు పాత్రలను అత్యంత సున్నితంగా, సురక్షితంగా శుభ్రం చేయడానికి ఇందులో ప్రత్యేక సాంకేతికతను వాడారు. తక్కువ విద్యుత్, పరిమిత నీటి వినియోగం.. దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. క్రోమాలో ఇది రూ.61,990 పలుకుతోంది.

Hafele Aqua Chrome

సాధారణ మధ్యతరగతి కుటుంబాల రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని డిజైన్ చేశారు. స్మార్ట్ వాష్ ఫీచర్లు, పాత్రల పరిమాణాన్ని బట్టి సెట్టింగ్స్ మార్చుకునే సౌలభ్యం ఇందులో ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ పాత్రలను తళతళలాడేలా చేయడం దీని స్పెషాలిటీ అని చెప్పవచ్చు. అమెజాన్ లో 25 శాతం రాయితీతో రూ.39,999కి దీనిని సొంతం చేసుకోవచ్చు.

IFB Neptune FX14

Advertisement

ప్రెజర్ కుక్కర్లు, పెద్ద పెద్ద గిన్నెలు, కడాయిలను శుభ్రం చేసేందుకు వీలుగా ‘ఐఎఫ్‌బీ నెప్ట్యూన్ ఎఫ్‌ఎక్స్14’ ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో ఉండే 14 ప్లేస్ సెట్టింగ్స్, అడ్జస్టబుల్ రాక్స్ వల్ల పెద్ద పాత్రలను కూడా చాలా సులువుగా లోపల సర్దవచ్చు. దీని 360 డిగ్రీల స్ప్రే ఆర్మ్ టెక్నాలజీ.. పాత్రల అన్ని మూలలకూ నీటిని చిమ్మి, మసాలా మరకలను సమర్థవంతంగా వదిలిస్తుంది. ఇది 20 శాతం రాయితీతో రూ.39,990కి అమెజాన్ లో సేల్ అవుతోంది.

Also Read: మీ ఫోన్ హ్యాక్ అయిందా? ఈ 5 సంకేతాలు ఉంటే.. ప్రమాదంలో పడ్డట్లే!

Faber FFSD 6PR 12S

చిన్న కుటుంబాలు, బ్యాచిలర్స్, తక్కువ స్పేస్ ఉన్న వంటగదులకు ఈ డిష్ వాషర్ సరిగ్గా సరిపోతుంది. 12 ప్లేస్ సెట్టింగ్స్‌తో వచ్చే ఈ డిష్‌వాషర్.. 3-4 ఉండే ఫ్యామిలీకి సరిపడా గిన్నెలను సమర్థవంతంగా కడుగుతుంది. మరీ తక్కువ పాత్రలు ఉన్నప్పుడు వాడుకోవడానికి ఇందులో ‘హాఫ్ లోడ్’ (Half Load) ఆప్షన్ కూడా ఉంది. దీనివల్ల నీరు, కరెంట్ రెండూ ఆదా అవుతాయి. దీని అసలు ధర రూ.41,990 కాగా, అమెజాన్ 27 శాతం డిస్కౌంట్ తో రూ.30,769 కే దీనిని అందిస్తోంది.

Also Read: షావోమి మరో అద్భుతం.. దుమ్మురేపే స్మార్ట్ కుక్కర్ లాంచ్.. ఇక బుల్లెట్ స్పీడ్‌తో వంట!

Related News

ఇలాంటి ఫ్రిజ్ ఇంట్లో ఉంటే..15 రోజులైనా ఫ్రెష్ ఫుడ్

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

Big Stories

Advertisement
×