BigTV English

Paris Paralympics: భారత్ కు ఏడో పతకం.. హై జంప్ లో నిషాద్ కుమార్ కు సిల్వర్!

Paris Paralympics: భారత్ కు ఏడో పతకం.. హై జంప్ లో నిషాద్ కుమార్ కు సిల్వర్!

Paris Paralympics | పారిస్ పారాలింపిక్స్ 2024 క్రీడల్లో ఆదివారం జరిగిన పురుషుల హై జంప్ పోటీల్లో ఇండియన్ స్టార్ అథ్లెట్ నిషాద్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. పారాలింపిక్స్ పోటీల్లో ఇది నిషాద్ సాధించిన రెండో పథకం కాగా భారతదేశ పారాలింపిక్స్ పథకాల జాబితాలో ఏడవది.


నిషాద్ కుమార్ హై జంప్ పోటీల్లో 2.04 మీటర్ల మార్క్ వద్ద జంప్ చేసి రెండవ స్థానంలో నిలిచాడు. మరోవైపు మరో భారతీయ క్రీడాకారుడు రామ్ పాల్ 1.95 మీటర్ల మార్క్ దాటి ఏడవ స్థానం పొందాడు. పురుషుల హై జంప్ చాంపియన్ గా అమెరికా అథ్లెట్ రాడ్‌రిక్ టౌన్‌సెండ్ రాబర్ట్స్ నిలిచాడు. రాబర్ట్స్ 2.08 మీటర్ల మార్క్ వద్ద జంప్ చేసి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. రాబర్ట్స్ ఇంతకుముందు కూడా మూడు సార్లు పారాలింపిక్స్ హై జంప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు.

నిషాద్, రాబర్ట్స్ మాత్రమే ఈ హై జంప్ పోటీల్లో రెండు మీటర్ల మార్క్ దాటిన క్రీడాకారులుగా నిలిచారు. ఇద్దరు అథ్లెట్లు రెండు మీటర్ల బార్ దాటాలని మొదటి రౌండ్ లోనే ప్రయత్నించినా విఫలమయ్యారు.కానీ అమెరికాన్ జంపర్ రాబర్ట్స్ మాత్రం రెండో రౌండ్ లో అద్భుతంగా జంప్ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నాడు.


నిషాద్ కుమార్ కూడా తన సెకండ్ జంప్ లో రెండు మీటర్ల మార్క్ దాటినా రాబర్ట్స్ ను అధిగమించలేకపోయాడు. మరోవైపు మూడో స్థానంలో రష్యా అథ్లెట్ జార్జీ మార్గీవ్ 2.0 మీటర్ల మార్క్ జంప్ చేసి కాంస్య పతకం సాధించాడు.

అయితే పారాలింపిక్స్ హై జంప్ పోటీల్లో ఇప్పటివరకు అత్యధిక హై జంప్ రికార్డులు రాబర్ట్స్ పేరిటే ఉన్నాయి. ఇంతకు ముందు రాబర్ట్స్ 2.15 మీటర్లు, 2.12 మీటర్లు, 2.10 మీటర్ల రికార్డులు గతంలో పారాలింపిక్స్ పోటీల్లో సాధించాడు. ఈ మూడు సార్లు కూడా బంగారు పతకం సాధించాడు.

మరోవైపు భారత్ కు పారాలింపిక్స్ లో ఆదివారం చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. షూటింగ్ లో బంగారు పతకం సాధించిన అవనీ లేఖరా.. R3 mixed 10m రైఫిల్ ప్రాన్ SH1 ఫైనల్ పోటీల్లో అర్హత సాధించలేపోయింది. అలాగే పురుషుల షాట్ పుట్ ఫైనల్ లో రవి రోంగాలి విఫలమయ్యాడు.

అయితే టాప్ ర్యాంక్ ఆర్చర్ రాకేష్ కుమార్ పురుషుల ఫైనల్స్ కు అర్హత సాధించినా ఫైనల్స్ లో బంగారు, కాంస్య పతకాలేవి దక్కించుకోలేకపోయాడు. అంతకుముందు భారత్ కోసం ఆరో మెడల్ సాధించడానికి ప్రీతిపాల్ అథ్లెటిక్స్ లో కాంస్య పతకం సాధించింది.

సోమవారం జరగబోయే పారాలింపిక్స్ పోటీల్లో భారత్ తరపున జావెలిన్ స్టార్ సుమీత్ అంటిల్ ఫైనల్స్ లో తన సత్తా చూపించనున్నాడు. ఆర్చెరీ పోటీల్లో మిక్స్ డ్ డబుల్స్ లో శీతల్ దేవి, రాకేష్ కుమార్ క్వార్టర్ ఫైనల్ లో పాల్గొంటారు. వీటితో పాటు బ్యాడ్ మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో సుహాస్ యతిరాజ్, నితేష్ కుమార్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ లో బంగారు పతకం కోసం పోటీ పడనున్నారు.

Also Read:  రోహిత్.. అందరూ అనుకునేంత సరదా మనిషి కాదు!

Related News

Mohammed Siraj : హైదరాబాద్ లో సిరాజ్ హోటల్… ఒక్కో ఐటమ్ ధర ఎంతంటే.. ఇవి మాత్రం కచ్చితంగా రుచి చూడాల్సిందే

Rishabh Pant : రిషబ్ పంత్ విరిగిన కాలి వేళ్ళు.. ఫోటో వైరల్..

Asia Cup 2025: దరిద్రంగా మారిన గిల్ ఎంపిక… తుది జట్టులో అభిషేక్ శర్మకు నో ఛాన్స్.. ఫైర్ అవుతున్న అభిమానులు !

IND vs Pak : ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగడంపై కేంద్రం షాకింగ్ నిర్ణయం !

Wankhede Stadium : మునిగిన ముంబై.. వాంఖడే స్టేడియంలోకి భారీగా వరద.. ఈ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Rohit Sharma : రోహిత్ శర్మకు ఘోర అవమానం… ఆ మ్యాచ్ లు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు

Big Stories

×