టెలికాం దిగ్గజం జియో 9వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తన వినియోగదారులను ఆకట్టుకునే క్రేజీ ప్లాన్ ను అనౌన్స్ చేసింది. ఈ మధ్యే కంపెనీ 500 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకోవడంతో మరింత జోష్ ఫుల్ గా ఈ వేడుకలను జరుపుకుంటుంది. అందులో భాగంగానే తన 9వ యానివర్సరీ సందర్భంగా రూ. 349 ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ లో అపరిమిత 5G డేటా, అపరిమిత కాల్స్, జియో హాట్ స్టార్, జియో సావన్, జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్ లు, డిజిటల్ గోల్డ్ రివార్డ్ లను ‘సెలబ్రేషన్ ప్లాన్’ పేరుతో అందిస్తోంది. కేవలం రూ. 349కే ఏకంగా రూ. 3,000 కంటే ఎక్కువ విలువైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
రూ. 349 సెలబ్రేషన్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు రోజుకు 2GB డేటా, 100 SMSలను పొందవచ్చు. ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు పొందే ప్రయోజనాలు ఇవే..
⦿ JioHostarకు 1 నెల సబ్ స్క్రిప్షన్
⦿JioSaavn కు 1 నెల సబ్ స్క్రిప్షన్
⦿ Zomato గోల్డ్ కు 3 నెల సబ్ స్క్రిప్షన్
⦿ NetMeds ఫస్ట్ కు 6 నెలల సబ్ స్క్రిప్షన్
⦿ JioHome కోసం 2 నెలల ఉచిత ట్రయల్
⦿ రిలయన్స్ డిజిటల్ పై 100% RC క్యాష్ బ్యాక్
⦿ AJIOలో ఫ్యాషన్ డీల్స్
⦿ EaseMyTrip లో ప్రయాణ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
జియో వార్షికోత్సవ వేడుక సందర్భంగా సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 7 వరకు వీకెండ్ వేడుకను ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో, అన్ని 5G స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వారి ప్లాన్ లతో సంబంధం లేకుండా ఉచిత అపరిమిత 5G డేటాను పొందుతారు. 4G స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రూ.39 యాడ్ ఆన్ ప్యాక్ ను కొనుగోలు చేయడం ద్వారా అపరిమిత 4G డేటాను పొందవచ్చు. అయితే, ఇది రోజుకు 3GB హై స్పీడ్ డేటాకు పరిమితం చేయబడుతుంది.
Read Also: రూ. 329కే 1000 జీబీ డేటా, BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ఇంత బాగున్నాయా?
కొత్త జియోహోమ్ వినియోగదారుల కోసం, టెలికాం దిగ్గజం కేవలం 1,200లకే 2 నెలల వ్యాలిడిటీతో సెలబ్రేషన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదనపు ప్రయోజనాలలో రూ.349 సెలబ్రేషన్ ప్లాన్ అన్ని ప్రయోజనాలతో పాటు 2 నెలల అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉంది.
Read Also: వచ్చేస్తోంది జియో 5G స్మార్ట్ లేన్.. దీని ప్రత్యేకత ఏమిటంటే?