EPFO UAN Activation: మీరు EPFO అకౌంట్ ఉన్న ఉద్యోగులా? అయితే, ఈ న్యూస్ మీ కోసమే. ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్(UAN) యాక్టివేషన్ కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) కీలక విషయాన్ని వెల్లడించింది. UAN యాక్టివేషన్ గడవును మరోసారి పెంచుతున్నట్లు వెల్లడించింది. నిజానికి ఈ గడువు నవంబరు 30తో ముగిసింది. అయితే, ఇంకా కొంత మంది ఉద్యోగులు అనివార్య కారణాలతో తమ UAN యాక్టివేషన్ చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు EPFO సంస్థ ప్రకటించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో ఉద్యోగాల్లో చేరిన వారి UAN యాక్టివ్ గా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
UAN యాక్టివ్ గా ఉంటేనే ELI బెనిఫిట్స్
UAN యాక్టివ్ గా ఉంటేనే ELI బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందని EPFO సంస్థ తెలిపింది. ‘‘UAN యాక్టివేషన్, బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ సీడింగ్ కు సంబంధించిన గడువును డిసెంబర్ 15 వరకు పెంచాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన వారి UAN యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ELI(ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్) బెనిఫిట్స్ పొందుతారు” అని ఖాతాదారులకు EPFO సూచించింది. చివరి వరకు వెయిట్ చేయకుండా వెంటనే UAN యాక్టివేట్ చేసుకోవాలని వెల్లడించింది.
Dear Employers,
The date of UAN activation and Aadhaar seeding of Bank Account has been extended till 15th December.
Ensure to do the same for all employees who have joined in the current financial year, starting with the latest joinees, to avail the benefit of the Employment… pic.twitter.com/u0Sob5Qujf— EPFO (@socialepfo) December 4, 2024
మూడు ELI పథకాలను ప్రారంభించిన కేంద్రం
రీసెంట్ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మూడు ELI పథకాలను ప్రవేశపెట్టింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
స్కీమ్ A: స్కీమ్ Aకు సంబంధించి తొలిసారి ఉద్యోగంలో చేరిన వారిని EPFO అకౌంట్స్ ఆధారంగా గుర్తిస్తారు. వారికి ఒక నెల సాలరీని ప్రొత్సాహంగా అందిస్తారు. ఈ మొత్తాన్ని సుమారు రూ.15 వేల వరకు మూడు ఇన్ స్టాల్ మెంట్స్ లో ఇస్తారు. ఈ మొత్తాన్ని పొందాలనుకునే వారి సాలరీ నెలకు రూ.లక్షలోపు ఉండాలి. అలాంటి వారే ఈ పథకానికి అర్హులు.
స్కీమ్ B: ఇక స్కీమ్ Bకు సంబంధించి ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి, యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారికి, వారి ఎంప్లాయర్స్ కు కూడా తొలి నాలుగేళ్ల పాటు EPFO ఇన్సెంటివ్స్ అందిస్తుంది. ఈ పథకం ఉద్యోగికి, ఉద్యోగం ఇచ్చిన సంస్థకు మేలు చేస్తుంది.
Read Also: నామినీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. కొత్తగా అమల్లోకి వచ్చిన బ్యాంకింగ్ రూల్స్ ఇవే!
స్కీమ్ C: ఇక స్కీమ్ Cలో చేరిన ప్రతి ఉద్యోగికి EPFO వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్ల పాటు నెలకు రూ.3 వేల వరకు అందిస్తారు. నెలకు రూ. లక్ష వరకు సంపాదిస్తున్న ప్రతి ఉద్యోగికి ఈ పథకం ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ELI పథకాలను డిసెంబర్ నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది.
Read Also: వెంటనే మీ ఆధార్ అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే ఏం అవుతుందో తెలుసా?