trinayani serial today Episode: పది నిమిషాల్లో నిరూపిస్తానని బయటకు వెళ్లిన అఖండస్వామి, తిలొత్తమ్మ, వల్లభలతో లోపలికి వస్తారు. లోపల ఎవ్వరూ కనిపించకపోయే సరికి మమ్మీ ఎవ్వరూ లేరు నిజం తెలుస్తుందని ఆ గారడీ పిల్ల పారిపోయిందా ఏంటి అని అడుగుతాడు. తను అంత పిరికిది కాదు వల్లభ అంటాడు స్వామి. ఇంతలో హాసిని వస్తూ కరెక్టు అంటూ బయటి వాళ్లకు తెలిసినంతగా ఇంట్లో వాళ్లకు తెలియదు చెల్లి గురించి అంటుంది. హాసిని కూడా విక్రాంత్‌ను పిల్లుస్తుంది. అత్తయ్య వాల్లు ఏవో ఆధారాలు తెచ్చినట్టు ఉంది అంటుంది. ఏం తెచ్చారు అమ్మా అని విశాల్ అడగ్గానే వల్లభ భూతద్దం చూపిస్తాడు.
అది చూసిన నేత్రి ఇలాంటి భూతద్దంతో చిన్నప్పుడు ఆడుకునేవాళ్లం అంటుంది. ఇప్పుడు నీ అట కట్టించడానికే ఇది తీసుకొచ్చామని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతలో స్వామి నయని చేతి అచ్చులు తీసి అందరికీ చూపిస్తాడు. ఎవరివి ఆ అచ్చులు అని అడుగుతాడు విశాల్. ఇవి నయని అరచేతి అచ్చులు అని తిలొత్తమ్మ చెప్పగానే అచ్చులతో ఏం చేస్తారు అమ్మా అని విశాల్ అడుగుతాడు. చెప్తాను ఉండు విశాల్ అంటూ వల్లభ అది తీసుకురాపో అని చెప్పగానే వల్లభ వెళ్లి కలర్ తీసుకొస్తాడు. అందులో రంగులు అద్దుకుని ఆ కాగితాల మీద నీ చేతుల అచ్చులు వేయి అని నేత్రికి స్వామి చెప్తాడు. అచ్చులు వేసి ఏం చేస్తారు అని విక్రాంత్ అడుగుతాడు.
దీంతో ఇప్పుడు నేత్రి వేసే అచ్చులు ఈ నయని అచ్చులతో సరిపోతాయో లేదో తెలుసుకుందాము అంటాడు స్వామి. ఆ అచ్చులు సరిపోకపోతే తను ఎవరో మీరే తేల్చుకోండి అంటాడు స్వామి. దీంతో విశాల్ కోపంగా ఈ పరీక్షల తర్వాత ఇంకెలాంటి పరీక్షలు చేయకండి అమ్మా అంటాడు. ఈ పరీక్షలతో తను ఎవరో తెలిసిపోతుంది విశాల్ అంటుంది తిలొత్తమ్మ. నేత్రి రంగుల్లో చేతులు అద్ది పేపరులో తన చేతి అచ్చులు వేస్తుంది. ఆ పేపర్స్ తీసుకుని వల్లభ చూస్తుంటే… నీకేం అర్థం అవుతుందిరా స్వాముల వారు చూస్తురులే అంటుంది.
మీరు చూసినా వ్యత్యాసం తెలుస్తుంది తిలొత్తమ్మ అని స్వామి చెప్పగానే అయితే సరే అని తిలొత్తమ్మ తీసుకుని చూస్తుంది. గాయత్రి పాప వచ్చి స్వామి చేతిలో ఉన్న నయని చేతి అచ్చుల పేపరును లాగుతుంది. ఇంతలో తిలొత్తమ్మ చేతి అచ్చులు తేడాగా ఉన్నాయని చెప్తుంది. దీంతో విశాల్ కోపంగా మీరే కావాలనే వేరే వాళ్ల అచ్చులు తీసుకొచ్చి నయనిది అంటున్నారు అని అనుమానంగా తిడతాడు. స్వామిని వెళ్లమని చెప్తాడు. ఏదో ఫ్రూవ్ చేస్తామని చెప్పి ఇలా చేశారేంటి అత్తయ్యా అని సుమన అడుగుతుంది. అలా చేశారా..? ఇలా చేశారా..? కాదు ఏదో చేయాలని చేశారు అంటాడు విక్రాంత్.
సుమన గార్డెన్‌లో ఏదో ఆలోచిస్తుంటే.. విక్రాంత్ వెళ్లి నువ్వు మేధావిలా ఆలోచించకు ఏదైనా అర్థం కాకపోతే అడుగు అంటాడు. త్రినేత్రి అని దేవీపురం అని చెప్పే కొత్త అక్క నేను నయని కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోరేంటి అంటుంది సుమన. వదినకు యాక్సిడెంట్ అయ్యాక కోలుకోవడానికి కనీసం రెండు నెలలైనా పట్టాలి.. అని విక్రాంత్ చెప్పగానే మరి రెండు రోజలైనా కాలేదు కదండి అంటుంది. అవును అందుకే మనం అర్థం చేసుకోవాలి అని విక్రాంత్ చెప్తాడు.
అదికాకుండా మా అక్క టెన్షన్ పడటం కూడా నేను గమనించానండి.. తనను పసిగట్టేస్తారని ఇబ్బంది పడటం చూశాను అంటుంది సుమన. దీంతో విక్రాంత్ కోపంగా సుమనను తిట్టి.. నీకు ఉండటానికి చోటు..తినడానికి తిండి ఇచ్చిన వాళ్లను అనుమానిస్తే.. అవేం లేకుండా రోడ్డున పడతావు చూడు అంటూ వార్నింగ్ ఇవ్వగానే అయితే ఎటూ తూగకుండా తటస్థంగా ఉంటాను అంటూ ఇంకొక డౌటు బుల్లిబావగారు అంటూ ఆత్మగా ఉన్న పెద్ద అత్తయ్య రంగులతో పేపరు మీద చేతులు ఎప్పుడు అద్దింది అని అడగ్గానే మరింత కోపంగా సుమనను తిట్టి విక్రాంత్ వెళ్లిపోతాడు.
చేతులకు అంటిన రంగులను కడిగేసుకుంటే పోతుంది కానీ మనసుకు తగిలిన గాయం పోదు కదా అంటాడు విశాల్. దీంతో ఎవర్ని ఏమన్నారు బాబుగార అని అడుగుతుంది. నిన్నే అందరూ అంటున్నారు కదా.. అంటాడు. అయినా నేను నయని కాదని తెలిస్తే ఏం జరుగుతుంది అని అడుగుతుంది. అయినా మీరు ఇంత సుత్తిమెత్తగా మాట్లాడితే ఎవరూ మిమ్మల్ని లెక్క చేయరు. మీ పెంపుడు తల్లి ఇలాగే ఎవరో ఒకర్ని ఎప్పుడూ తీసుకొచ్చి గోల చేస్తుంది అని నేత్రి చెప్తుంది.
కానీ వాళ్లు రంగుల్లో చేతులు అద్దించి వాళ్లు అన్న మాటలు నిజం అని నిరూపించాలి అనుకుంటున్నారు అనగానే చేతులు చూసి జాతకాలు చెబితే ఇక అన్నింటికీ చేతులే చూడాలి అంటుంది. మరోవైపు వల్లభను తిలొత్తమ్మ పిచ్చకొట్టుడు కొడుతుంది. నయని చేతి ముద్రలు తీసుకురమ్మంటే గాయత్రి అక్కవి తీసుకొస్తావా…? అంటూ తిడుతుంది. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?