EPFO Update: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఇవి ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను పెంచే విషయంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఒక సంవత్సరం లోపు మరణించే ఉద్యోగులకు బీమా ప్రయోజనాలను కూడా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మార్పు లక్షలాది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించడంతో పాటు, వారి ఆర్థిక భద్రతను కూడా పెంచుతుంది.
EPFO తన డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నియమాలు ఉద్యోగులు, వారి కుటుంబాలకు మెరుగైన ఆర్థిక భద్రతను అందించడానికి లక్ష్యంగా ఉన్నాయి. ఇప్పుడు, ఒక ఉద్యోగి ఒక సంవత్సరం ముందే ఉద్యోగం మరణిస్తే, ఆయన కుటుంబానికి బీమా ప్రయోజనం లభిస్తుంది.
గతంలో ఒక ఉద్యోగి ఒక సంవత్సరం ముందే మరణిస్తే, అతని కుటుంబానికి బీమా ప్రయోజనాలు లభించేవి కావు. కానీ ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. ఇప్పుడు, ఒక ఉద్యోగి ఒక సంవత్సరం లోపు మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 50,000 బీమా లభిస్తుంది. ఈ నిర్ణయం ప్రతి సంవత్సరం 5,000 కంటే ఎక్కువ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Read Also: PAN Card 2.0: పాన్ కార్డ్ 2.0కు అప్లై చేశారా లేదా.. ఇలా ఈజీగా చేసుకోవచ్చు..
గతంలో ఒక ఉద్యోగి కొంతకాలం PFకు జమ చేయకపోయి మరణిస్తే, అతనికి EDLI పథకం ప్రయోజనం లభించదు. కానీ ఇప్పుడు ఈ నియమాన్ని మార్చారు. ఒక ఉద్యోగి చివరిసారిగా PF చందా చెల్లించిన ఆరు నెలల్లోపు మరణిస్తే, అతని కుటుంబానికి బీమా ప్రయోజనం లభిస్తుంది. ఈ మార్పు ద్వారా ప్రతి సంవత్సరం 14,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఉద్యోగాలు మారడం మధ్య ఏర్పడే అంతరానికి సంబంధించి EPFO మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు, ఒక ఉద్యోగి ఒక ఉద్యోగాన్ని వదిలివేసి, రెండో కంపెనీలో ఉద్యోగంలో చేరేందుకు రెండు నెలల గ్యాప్ ఉంటే, అతనికి కూడా బీమా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మార్పు ద్వారా ఉద్యోగులు వెంటనే వేరే ఉద్యోగం చేపట్టకపోయినా రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ. 7 లక్షల వరకు బీమా ప్రయోజనాన్ని పొందుతారు. ఈ మార్పు ద్వారా ప్రతి సంవత్సరం 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం లభిస్తుంది.
దీంతో పాటు కంపెనీలకు పీఎఫ్ డిపాజిట్ చేయడంలో ఆలస్యం కోసం జరిమానాను EPFO తగ్గించింది. ఇప్పుడు కంపెనీలు నెలకు 1% జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది వారికి ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ మార్పులు EPFO ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను పెంచడం, ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడడంతోపాటు వారి మంచి భవిష్యత్తుకు భరోసా ఇస్తాయని చెప్పవచ్చు.