Rahul Gandhi Gujarat Congress| గుజరాత్‌లో కాంగ్రెస్ నేతలపై పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఉన్న నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్ కాంగ్రెస్ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సమావేశంలో మాట్లాడుతూ.. “గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేయకలు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. బీజేపీతో చేతులు కలిపారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 22 శాతం ఓట్లు పెరిగాయి.. అక్కడ విజయం అసాధ్యం అనుకున్నాం కానీ కాంగ్రెస్ నాయకులు సాధించి చూపించారు.
Also Read: రన్యారావును పోలీసులు కొట్టారా?.. ఆగ్రహించిన మహిళా సంఘాలు
మరోవైపు గుజరాత్‌లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. అయినా ఇక్కడ కొందరు నాయకులు అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్‌లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేమీ లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలి. కింది స్థాయి కార్యకర్త నుంచి పిసిసి స్థాయి నేతల వరకు అందరూ పార్టీ విజయం కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు.
అలాగే, గత 30 ఏళ్లుగా గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో లేదు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ 2007, 2012, 2017, 2022, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయి. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదు. గుజరాత్ పట్ల మన బాధ్యతలను నెరవేర్చే వరకు ఈ రాష్ట్రం ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరు. ప్రజల పట్ల మనం బాధ్యతతో ఉన్న రోజున వారే మనకు అధికారం ఇస్తారు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
మన బాధ్యతలు నెరవేర్చేంత వరకు అధికారం ఇవ్వమని గుజరాత్ ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా బిజేపీ అందించిన పాలన విఫలమైందని.. గుజరాత్ ప్రజలు కొత్త విజన్ కోసం వేచి చూస్తున్నారని అన్నారు. ఆశించిన విధంగా రాష్ట్రం ప్రగతి సాధించడం లేదని, కాంగ్రెస్ కూడా అందుకు సరైన మార్గాన్ని చూపించలేకపోతోందని అభిప్రాయపడ్డారు.‘‘గుజరాత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో రెండు రకాలున్నారు. నిజాయతీగా పనిచేస్తూ ప్రజలను గౌరవిస్తూ, వారి కోసం పోరాడుతూ, పార్టీ సిద్ధాంతాన్ని తమ గుండెల్లో పెట్టుకునేవారు ఒకరు. రెండో రకానికి వస్తే.. ప్రజలతో సంబంధాలు కొనసాగించకుండా వారితో దూరంగా ఉండటమే కాకుండా గౌరవం కూడా ఇవ్వరు. ఇందులో సగం మంది భాజపాతో ఉన్నారు’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.