PAN Card 2.0: దేశంలో ప్రస్తుతం ఆధార్‌తోపాటు పాటు పాన్‌కార్డు కూడా ఒక తప్పనిసరి గుర్తింపు పత్రంగా మారిపోయింది. అయితే అనేక మంది ఇప్పటికీ పాత పాన్‌కార్డులను వినియోగిస్తున్నారు. అలాంటి వారు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ప్రవేశపెట్టిన కొత్త PAN 2.0 కోసం అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది మునుపటి దాని కంటే మరింత సురక్షితమైనదని, అధునాతన సాంకేతిక లక్షణాలతో కూడి ఉందని చెబుతున్నారు. కొత్త పాన్ కార్డులో QR కోడ్ ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్కామర్లు వీటి నకిలీని తయారు చేయడం కూడా అంత ఈజీ కాదని అంటున్నారు. అయితే పాత కార్డుకు బదులు, కొత్త పాన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, అసలు పాన్ కార్డు లేని వారు ఏం చాయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పాన్ 2.0: అనేది పాత పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ వెర్షన్. ఇది కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్ మిషన్ కింద ప్రారంభించబడింది. దీనికి అనేక కొత్త లక్షణాలు ఉన్నాయి.
QR కోడ్ టెక్నాలజీ: ఇది పాన్ కార్డ్ హోల్డర్ పేరు, పాన్ నంబర్ వంటి వివరాలను స్కాన్ చేయడం ద్వారా ధృవీకరించడానికి సహాయపడుతుంది.
అధునాతన భద్రతా ప్రోటోకాల్: ఇది పాన్‌కార్డ్ మోసం, ఆదాయపు పన్ను ఎగవేతను నిరోధించడంలో ఉపయోగపడుతుంది.
చిరునామా రుజువు: ఇప్పుడు దీనిని గుర్తింపు కార్డు లేదా చిరునామా రుజువుగా కూడా వినియోగించుకోవచ్చు.
ఇప్పటికే పాన్‌కార్డ్ ఉన్న వారు కొత్త పాన్ పొందడానికి మళ్లీ అప్లై చేసుకోకుండానే పాన్ 2.0కు మారవచ్చు. దీని కోసం కొత్త క్యూఆర్ కోడ్ ఎన్ బుల్డ్ వెర్షన్ కోసం అప్లై చేయాలి. దీని కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా పాన్ కార్డ్ కోసం అప్లై చేసేవారు మాత్రం రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు వారి గుర్తింపు కార్డు, అడ్రస్, పుట్టిన తేదీ ధృవపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ముందుగా NSDL లేదా UTIITSL వెబ్‌సైట్‌కు వెళ్లండి
“New PAN” ఎంపికను సెలక్ట్ చేయండి
ఫారం 49A అప్లికేషన్ లో మీ వివరాలు పూరించండి
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి (AADHAAR, గుర్తింపు, చిరునామా సాక్ష్యాలు)
(రూ. 50) చెల్లింపు చేయండి
ఆ తర్వాత దరఖాస్తు సమర్పించండి
15 నుంచి 20 రోజుల్లో కొత్త పాన్ కార్డు మీ చిరునామాకు పంపిస్తారు
మీరు ఇంకా కొత్త పాన్ కార్డు తీసుకోకపోతే, వీలైనంత త్వరగా దీని కోసం అప్లై చేయండి. మీ ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేసుకోవడమే కాకుండా మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.