BigTV English

IRCTC Ticket Booking: మీ IRCTC అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేస్తే జైలుకు వెళ్తారా? నిజం ఏమిటి?

IRCTC Ticket Booking: మీ IRCTC అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేస్తే జైలుకు వెళ్తారా? నిజం ఏమిటి?

IRCTC Ticket Booking| ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మీరు ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా ఆన్ లైన్ లో మీ స్నేహితులు, కుటుంబ సభ్యలుకు టికెట్ బుక్ అది నేరమని, చేసిన వారు జైలు కెళ్తారని ఒక సోషల్ మీడియా పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలో నిజమెంత? అని చెక్ చేస్తే.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ వార్త పూర్తిగా నిజం కాకపోయినా.. పూర్తిగా అబద్ధం కూడా కాదు.


ఈ వార్త గురించి నిజం తెలుసుకునేందుకు ట్విట్టర్ ‘X‘ లో ఐఆర్‌సిటిసి అధికారిక అకౌంట్ లోని ఒక పోస్టు ప్రకారం.. ఒక వ్యక్తి తన ఐఆర్‌సిటిసి అకౌంట్ ద్వారా ఒక నెలలో అత్యధికంగా 12 టికెట్లు మాత్రమే కొనుగోలు చేయగలడు. ఒకవేళ ఆధార్ కార్డ్ లింక్ చేస్తే.. అత్యధికంగా 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. ప్రయాణీకులలో కనీసం ఒకరి ఆధార్ కార్డ్ టికెట్లతో వెరిఫై చేయాలి.

Also Read:  ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!


ఇంతకుముందు ఒక వ్యక్తి ఐఆర్‌సిటిసి ద్వారా ఎన్ని టికెట్లు చేసుకోవచ్చు. కానీ కొందరు టికెట్లు బుకింగ్ కమర్షియల్ గా ఉపయోగిస్తున్నందకు ఐఆర్‌సిటిసి కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది. ఐఆర్‌సిటిసి టికెట్లు కమర్షియల్ గా విక్రయించడం రైల్వే చట్టం 1989 ప్రకారం నేరం. అలా చేసిన వారు చట్ట ప్రకారం శిక్షార్హులు.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్టు ప్రకారం.. ఒక వ్యక్తి ఐఆర్‌సిటిసి టికెట్లు బుక్ చేసుకునే సమయంలో అతని ఇంటి పేరు (సర్ నేమ్)తో ఉన్న వ్యక్తులకు టికెట్ బుక్ చేస్తే.. జైలు శిక్ష అని ఉంది. ఇది పూర్తిగా అబద్ధం. అందుకే కేవలం రైల్వే శాఖ మార్గదర్శకాల ప్రకారమే టికెట్లు బుక్ చేసుకోవాలి.

Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

రైల్వే టికెట్ బుకింగ్ పై వస్తున్న అపోహల కారణంగా టికెట్ బుకింగ్ మార్గదర్శకాలపై రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది. బుకింగ్ సమయంలో మీ బంధువులు, స్నేహితులు, లేక ఎవరికోసమైనా సరే మీరు బుకింగ్ చేయగలరు. ఇందులో ఇంటిపేరుకు సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవం. ఒకే ఇంటిపేరుతో టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష లేదా ఫైన్ అనే సోషల్ మీడియా పోస్టు ఫేక్ అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అయితే వ్యక్తిగతంగా టికెట్లు బుక్ చేసేవారు దానిని కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించకూడదు.

Also Read: బ్యాంకు లో నెగిటివ్ బ్యాలెన్స్ తో డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి.. తిరిగి వస్తాయి!!

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×