BigTV English

BlackRock Office Rent : నెలకు రూ.1.28 కోట్లు ఆఫీస్ రెంటు!.. బ్లాక్ రాక్ కంపెనీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..

BlackRock Office Rent : నెలకు రూ.1.28 కోట్లు ఆఫీస్ రెంటు!.. బ్లాక్ రాక్ కంపెనీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..

BlackRock Office Rent : నగరాల్లో ఆఫీస్ రెంట్లు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. పైగా బడా కంపెనీల ఆఫీసులన్నీ కమర్షియల్ ఏరియాల్లోనే ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఆఫీస్ రెంట్లు నెలకు లక్షల్లోనే ఉంటాయి. అలాంటిది ఒక ఆఫేస్ రెంట్ నెల రూ. కోటి దాటింది. అయిదే ఇంత ధర కేవలం ఆ ప్రాంతాన్ని బట్టి కాదు. అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసే కంపెనీ పేరుని బట్టి.


తాజాగా దేశ ఆర్థిక రాజధానిగా పిలవబడే ముంబై మహానగరంలో కాస్ట్లీ ప్రాంతమైన వర్లీలో ఒక ఆఫీస్ రెంటు నెలకు రూ.1.28 కోట్లు అని మీడియాలో కథనాలు వచ్చాయి. వర్లీ ప్రాంతంలోని రహేజా అల్టిమస్ బిల్డింగ్ లో 42,700 స్క్వేర్ ఫీట్ గల ఆఫీస్ స్పేస్ ని బ్లాక్ రాక్ కంపెనీ నెలకు రూ.1.28 కోట్లకు అద్దెకు తీసుకుంది. ఆ బిల్డింగ్ విస్పరింగ్ హైట్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆస్తి.

ఈ విస్పరింగ్ హైట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో కె రహేజా కార్ప్ గ్రూప్, జిఐసి సింగపూర్ కంపెనీలు పార్టనర్లు. ఈ కొత్త బిల్డింగ్ ల ఆఫీస్ స్పేస్ కోసం బ్లాక్ రాక్ కంపెనీ ఏకంగా రూ.12.81 కోట్లు అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్ చేసింది. ఈ ఆఫీస్ రెంటల్ రిజిస్ట్రేషన్ జూలై 18న జరిగిందని సమాచారం. కేవలం రిజిస్ట్రేషన్ కోసమే రూ.24.11 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించారట.


బిల్డింగ్ లోని 13వ ఫ్లోర్ లో ఆఫీస్ స్పేస్ రెంటు తీసుకున్న బ్లాక్ రాక్ కంపెనీ ఆ ఫ్లోర్ ని రెండు భాగాలుగా విభజించి ఆఫీస్ ఏర్పాటు చేసింది. మొదటి భాగం 37,487 స్క్వేర్ ఫీట్ ఉండగా, రెండో భాగం 5213 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఆగస్టు 2024 నుంచి జూలై 2029 వరకు అయిదేళ్ల పాటు రెంటు కోసం కాంట్రాక్లు చేసుకున్న బ్లాక్ రాక్ కంపెనీ ప్రతి స్క్వేర్ ఫీట్ కు రూ.325 రెంటు చెల్లించేందుకు అంగీకరించింది.

వర్లీ ప్రాంతంలో మొత్తం 3.10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రహేజా అల్టిమస్ కమర్షియల్ బిల్డింగ్ లో 1.12 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ వినియోగానికి కేటాయించారు. ఈ కమర్షియల్ బిల్డింగ్ లో చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల ఆఫీస్ లు ఉన్నాయి.

అక్టోబర్ 2022లోనే మోర్గన్ స్టాన్లే కంపెనీ 86,200 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ ని ప్రతి స్క్వేర్ ఫీట్ కు రూ.325 రెంటుకు తీసుకుంది. అలాగే జనవరి 2024లో బార్‌క్లేస్ కంపెనీ 64,995 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ కోసం రూ.2.08 కోట్లకు కాంట్రాక్టు కుదుర్చుకుంది.

Also Read: అనిల్ అంబానీపై రూ.25 కోట్లు జరిమానా, 5 ఏళ్లు బ్యాన్.. సెబీ కీలక ఉత్తర్వులు!

ముంబైలో అత్యంత ఖరీదైన ఆఫీస్ స్పేస్ బాంద్రా కుర్లా కాంపెక్స్ లో ఉంది. ఇక్కడ ఐఎంసి ఇండియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతి స్క్వేర్ ఫీట్ కి రూ.700 ఆఫీస్ రెంట్ చెల్లిస్తోంది.

ఇక బ్లాక్ రాక్ కంపెనీ విషయానికొస్తే.. ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. అమెరికాలో దీని పేరెంట్ కంపెనీ ఉంది. డిసెంబర్ 2023 వరకు బ్లాక్ రాక్ కంపెనీ ఆస్తుల విలువ 10 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. బ్లాక్ రాక్ కంపెనీకి 38 దేశాల్లో 78 ఆఫీసులున్నాయి.

Also Read: మీ IRCTC అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేస్తే జైలుకు వెళ్తారా? నిజం ఏమిటి?

Related News

EPFO New Rule: పీఎఫ్ డబ్బులతో ఇల్లు కట్టాలి అనుకుంటున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకే.. EPFO కొత్త మార్గదర్శకాలివే!

Jio Recharge Plans: మిస్ అయ్యానే.. జియోలో ఇన్ని ఆఫర్లు ఉన్నాయా!

iPhone 17 Air: వావ్ ఎంత స్మూత్‌గా ఉంది.. iPhone 17 Air సూపరబ్బా.

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Jio Mart vs D-Mart: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?

Gold Mines: ఆ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం.. తవ్వే కొద్ది బయటపడుతోన్న గోల్డ్.. ఎక్కడో తెలుసా?

Big Stories

×