BigTV English

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై షాకింగ్ డిస్కౌంట్లు.. కొనేయండి బాసూ!

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై షాకింగ్ డిస్కౌంట్లు.. కొనేయండి బాసూ!

Flipkart Best Deals On Top 3 EV Scooters: పెరిగిన పెట్రో ధరలకు తోడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలు రావడంతో నెమ్మదిగా పెట్రో వాహనాలకు స్వస్తి పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీలు సరికొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. గత కొంత కాలంగా ఈవీ అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. భారత్ లోనూ అమ్మకాలు కాస్త మందగించాయి. ఈ నేపథ్యంలోనే కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్త తగ్గింపు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అంతేకాదు, ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా టాప్ 3 ఈవీ స్కూటర్లపై క్యాష్‌ బ్యాక్, నో కాస్ట్ EMI, సహా అదిరిపోయే తగ్గింపు ధరలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో తమ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ఆలోచన ఉంటే ఈ ఆఫర్లు చెక్ చేయండి..


ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ స్పెషల్ ఆఫర్లు

1.ఓలా ఎస్1 ప్రో


MRP: రూ. 1,34,999

ఫ్లిప్‌ కార్ట్ ధర: రూ. 1,16,499

భారత్ లో అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా ఎస్1 ప్రో టాప్ పొజిషన్ లో ఉంది.  ఆగస్ట్ 2024 నాటికి ఈవీ మార్కెట్ లో 33 శాతం వాటాను కలిగి ఉంది. ఇక S1 ప్రో ధర ఓలా వెబ్ సైట్ లో రూ. 1,34,999 ఉండగా, ఫ్లిప్ కార్ట్ స్పెషల్ ఆఫర్ లో భాగంగా రూ. 10,000 తగ్గింపును అందిస్తోంది. క్రెడిట్ కార్డు ద్వాకా కొనుగోలు చేయడం ద్వారా రూ. 3 వేలు ఇన్ స్టంట్ డిస్కౌంట్ తో పాటు నెలకు రూ. 1,750 చెల్లిస్తే సరిపోతుంది. కూపన్ లేదంటే మరో 6 శాతం తగ్గింపు క్యాష్‌ బ్యాక్ స్కీమ్ కూడా అందిస్తోంది. మొత్తంగా S1 ప్రో రూ. 1,16,499 కంటే తక్కువకే లభిస్తుంది.

2.చేతక్ 3202

MRP: రూ. 1,15,018

ఫ్లిప్‌ కార్ట్ ధర: రూ. 97,999

బజాజ్ ఆలో నుంచి అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఈవీ చేతక్ 3202. ఈ స్కూటర్ 3 వేరియంట్లలో లభిస్తుంది.  2903, 3202తో పాటు ప్రీమియం వేరియంట్ లో అందుబాటులో ఉంది. మిడ్ లెవల్ ట్రిమ్, చేతక్ 3202 బజాజ్ ఆటో అధికారిక వెబ్ సైట్ లో ధర రూ. 1,15,018 ఉంది. ఫ్లిఫ్ కార్ట్  బిగ్ బిలియన్ డేస్ సేల్‌ లో భాగంగా రూ. 97,999కే లభిస్తోంది.

3.ఏథర్ 450 అపెక్స్

MRP: రూ. 1,94,998

ఫ్లిప్‌కార్ట్ ధర: రూ. 1,73,946

అపెక్స్ ఏథర్ 450 లైనప్‌ లో ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. Ather 450 Apex వెబ్ సైట్ లో రూ. 1,94,998కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ లోఈ వేరియంట్ రూ. 1,82,446కి లభిస్తుంది. అంతేకాదు, ఇన్ స్టంట్ ఆఫర్లతో కలిపి రూ. 1,73,946కే సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Read Also:పండక్కి సరికొత్త మారుతి సుజుకి డిజైర్, అందుబాటు ధరలోనే.. అద్భుతమైన ఫీచర్స్

Related News

Jio recharge plans 2025: ఓర్నీ.. జియోలో ఇన్ని రీఛార్జ్ ఆఫర్లు ఉన్నాయా? బెస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి

Gold Price: దసరా పండుగకు బంగారం లక్షన్నర దాటేస్తుందా..?

October Bank Holidays: అక్టోబర్‌లో 21 రోజుల బ్యాంక్ హాలిడేలు.. పూర్తి లిస్ట్ ఇదిగో!

New Rules from October 1: పలు రంగాల్లో ఆర్థిక లావాదేవీలు.. అక్టోబర్ ఒకటి నుంచి కీలక మార్పులు

TCS Layoffs: ఆందోళనలో TCS ఉద్యోగులు, ఏకంగా 30 వేల ఉద్యోగాలు అవుట్!

Hostels History: హాస్టల్ అనే పదం ఎవరు కనిపెట్టారు? లేడీస్, బాయ్స్ హాస్టల్స్ ఎందుకు వేరు చేశారు?

Realty Sector: ఒక్కో ఫ్లాట్ 100 నుంచి Rs. 500 కోట్లు.. అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు, ఏయే ప్రాంతాల్లో

Patanjali Electric Cycle: పతంజలి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. 300కిమీ రేంజ్‌లో టాప్ స్పీడ్!

Big Stories

×