BigTV English

Balakrishna: అందరికీ లిమిట్స్ ఉంటాయి.. ఐఫా వేడుకల్లో మీడియాపై బాలకృష్ణ ఫైర్

Balakrishna: అందరికీ లిమిట్స్ ఉంటాయి.. ఐఫా వేడుకల్లో మీడియాపై బాలకృష్ణ ఫైర్

Nandamuri Balakrishna At IIFA 2024: ఇటీవల దుబాయ్‌లో ఐఫా అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం సౌత్, నార్త్.. ఇలా అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలు ఒక్కచోట చేరారు. ఇందులో నందమూరి బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ అవార్డ్ దక్కింది. ఈవెంట్‌లోకి వెళ్లేముందు కాసేపు మీడియాతో ముచ్చటించారు బాలయ్య. గోల్డెన్ లెగసీ అవార్డ్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా దుబాయ్‌లోని తన తెలుగు ఫ్యాన్స్ కోసం తెలుగులో మాట్లాడారు. తన తండ్రి సీనియర్ ఎన్‌టీఆర్ గురించి, ఆయన గొప్పదనం గురించి గుర్తుచేసుకున్నారు. ఈ ఐఫాలో వేడుకల్లో చిరంజీవి, వెంకటేశ్ లాంటి హీరోలతో ఒక స్టేజ్‌పై కనిపించారు బాలయ్య.


రామారావు లెగసీ

ముందుగా అందరికీ లిమిట్స్ ఉంటాయంటూ మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానలు ఇవ్వడం మొదలుపెట్టారు బాలకృష్ణ. ‘‘ముందుగా నేను నా నిర్మాతలు, దర్శకులు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ కేవలం నా రాష్ట్రానికి, నా భాషకు చెందినవారు మాత్రమే రాలేదు. అన్ని భాషల సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు అంతా ఒకే ప్లాట్‌ఫార్మ్‌పై ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఇష్టపడుతున్న వారందరికీ థాంక్యూ. హీరోగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నందుకు ఐఫా లెగసీ అవార్డ్ నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. రామారావు లెగసీ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.


Also Read: ఒకే ఫ్రేంలో చిరు, బాలయ్య, వెంకీ… ఐఫా అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

మొదటి సినిమా

50 ఏళ్లు హీరోగా తనను ముందుకు నడిపించిన అంశం ఏంటని అడగగా.. అది ఆయన డెడికేషన్ అని అన్నారు బాలకృష్ణ. ‘‘నా పనే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. నేను చాలా రకాల పాత్రలు చేశాను. నేను 1991లోనే ఇండియాలోని మొదటి సైన్స్ ఫిక్స్ సినిమా చేశాను. మా నాన్న తర్వాతే నేను. ఆయన బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే అలాంటి సినిమా చేశారు. అప్పట్లో అంత టెక్నాలజీ లేదు, గ్రాఫిక్స్ లేవు. ఆ సినిమానే ‘ఆదిత్య 369’. అది చాలా పెద్ద హిట్ అయ్యింది. అలాంటివే నన్ను ఇన్‌స్పైర్ చేసి సక్సెస్ అందిస్తాయి. డెడికేషన్‌తో చేస్తే ప్రేక్షకులు కూడా చూస్తారు, ఆదరిస్తారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే వారికి మంచి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటాం’’ అని అన్నారు బాలయ్య.

సక్సెస్ ఫార్ములా

ప్రస్తుతం బాలకృష్ణ తన సక్సెస్ ఫార్ములా అయిన కమర్షియల్ సినిమాలతోనే బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నారు. ఆయన చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’లో హీరోగా నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఎన్‌బీకే 109తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఆయన ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలయ్య చాలా యంగ్‌గా కనిపిస్తున్నారని గ్లింప్స్ చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయంలో తొందరపడని బాలయ్య.. ఒక మూవీ పూర్తయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాతే మరో మూవీని సైన్ చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×