E-Paper
Advertisement

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేశాడు.. ఏడాదికి రూ.600 కోట్లు సంపాదన.. ఎలాగంటే

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేశాడు.. ఏడాదికి రూ.600 కోట్లు సంపాదన.. ఎలాగంటే
Advertisement

Techie Turns Farmer| స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి సొంత వ్యాపారం ప్రారంభించడం అంత సులభం కాదు. అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాత్రం అమెరికాలోని తన ఐటీ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. రైతులకు మెరుగైన అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఆయన ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు ఆయన స్థాపించిన కంపెనీ ఏటా రూ.600 కోట్ల వ్యాపారం చేస్తోందని సమాచారం. అయితే ఇదంతా సులభంగా జరగలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదొడుకుల ఎదుర్కొని కిందపడిన ప్రతీసారీ మళ్లీ ఓర్పుతో తన ప్రస్థానం సాగించారు. ఈ రోజు వేల మంది రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నారు. ఆయన పేరు శశికుమార్.

శశి కుమార్ ఐటీ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు?

శశి కుమార్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత ఆయన విప్రో సంస్థలో ఉద్యోగంలో చేరారు. దాదాపు 12 సంవత్సరాలు ఆయన ఐటీ రంగంలో పనిచేశారు. తర్వాత అమెరికాలో ఉద్యోగం చేస్తూ మంచి కెరీర్‌ను కొనసాగించారు. అయితే వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన ఆయనను ఆకర్షించింది. దీంతో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయ వ్యాపారంలోకి ప్రవేశించారు.

ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కుటుంబం

Advertisement

శశి కుమార్ తీసుకున్న నిర్ణయానికి మొదట కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించలేదు. సోషల్ మీడియా శశి కుమార్ గురించి ఉన్న పోస్టు ప్రకారం.. ఆయన వ్యవసాయంలోకి రావడాన్ని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణంగా ఆయన తండ్రి దాదాపు ఎనిమిదేళ్లు శశితో మాట్లాడలేదట.

అయినా తన లక్ష్యాన్ని వదులుకోని శశి కుమార్

ఎన్నో వ్యక్తిగత సమస్యలు ఎదురైనా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లారు. అక్షయకల్ప కంపెనీ స్థాపించారు. ప్రారంభంలో ఎన్నో ఆర్థిక కష్టాలు వచ్చాయి. అక్షయకల్ప ప్రారంభ దశలో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. మొదటి తొమ్మిదేళ్లలో సంస్థ ఆరుసార్లు దివాలా అంచుకు చేరిందని సమాచారం. ఆ సమయంలో శశి కుమార్ భార్య తన రూ.30 లక్షల పొదుపును ఉపయోగించారని పోస్టులో పేర్కొన్నారు.
ఆ ఆర్థిక సహాయం సంస్థను క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగించేందుకు ఉపయోగపడింది. తర్వాత సంస్థ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించగలిగింది.

వేలాది మంది రైతులలో పని చేస్తున్నసంస్థ

Advertisement

ప్రస్తుతం అక్షయకల్ప దాదాపు 2,800 మంది రైతులతో కలిసి ఆర్గానిక అంటే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయిస్తోంది. ప్రతి రైతుకు నెలకు సుమారు రూ.1.28 లక్షలు చెల్లిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రైతులు ఏడాదికి దాదాపు రూ.480 కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయని కూడా సమాచారం. రైతులకు స్థిరమైన మార్కెట్ అందించడంపై సంస్థ ప్రధానం టార్గెట్.

నెలకు రూ.60 కోట్ల లాభమా?

అక్షయకల్ప నెలకు సుమారు రూ.60 కోట్ల లాభం ఆర్జిస్తోందని సోషల్ మీడియా పోస్టు పేర్కొంది. ఈ గణాంకాలు సంస్థ సాధించిన భారీ వృద్ధిని సూచిస్తున్నాయి. అయితే ఈ ఆర్థిక వివరాలు సోషల్ మీడియా ద్వారా వచ్చినవే.

Also Read: బాబోయ్ రూ.22,000 కోట్ల రుణ మాఫీ.. బడా వ్యాపారవేత్తకు కోర్టు భారీ ఉపశమనం

శశి కుమార్ ప్రయాణం ఏం చెబుతోంది?

శశి కుమార్ కథలో ఉద్యోగం, కుటుంబ వ్యతిరేకత, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార సవాళ్లు కనిపిస్తాయి. అయినా ఆయన తన లక్ష్యంపై నమ్మకంతో ముందుకు సాగారు. సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి కొత్త రంగంలో అడుగుపెట్టిన ఆయన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా మారింది.

Related News

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

అమ్మమ్మ చేతి రుచికి రూ.2 వేల పెట్టుబడి.. నేడు రూ.580 కోట్ల సామ్రాజ్యం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ సక్సెస్‌ స్టోరీ!

Big Stories

Advertisement
×