Ai+ Nova 2 Power 5G: సాధారణంగా కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాతే దాని పనితీరు, భద్రత గురించి సమీక్షలు వస్తుంటాయి. కానీ Ai+ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తోంది. భారత్‌లో Nova 2 Power 5G విడుదలకు ముందే సాంకేతిక నిపుణులు, సమీక్షకులు, కంటెంట్ క్రియేటర్లతో పాటు ఎథికల్ హ్యాకర్లకు కూడా ఫోన్‌ను అందించి పరీక్షించనుంది. ఫోన్‌లోని లోపాలను ముందుగానే గుర్తించి, వినియోగదారులకు మరింత నమ్మకమైన అనుభవాన్ని అందించాలన్నది కంపెనీ ఉద్దేశం.
Ai+ ప్రారంభించిన Project Open Review 2.0 కార్యక్రమంలో ఎంపికైన సాంకేతిక నిపుణులు, పాత్రికేయులు, కంటెంట్ క్రియేటర్లు ఫోన్‌ను విడుదలకు ముందే ఉపయోగించనున్నారు. ఈసారి ఎథికల్ హ్యాకర్లను కూడా ఇందులో భాగం చేసింది. వారు ఫోన్ భద్రత, గోప్యత, సాఫ్ట్‌వేర్‌లో ఉండే లోపాలను స్వతంత్రంగా పరిశీలించనున్నారు.
Also Read: Realme C100i 4G లాంచ్.. రూ.14,999కే ఇన్ని ఫీచర్లా? పూర్తి వివరాలు మీ కోసం!
ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి తమకు ఎదురైన అనుభవాలను స్వేచ్ఛగా పంచుకునే అవకాశం ఉంటుందని Ai+ చెబుతోంది. గతంలో నిర్వహించిన కార్యక్రమానికి 700కు పైగా దరఖాస్తులు రావడంతో, ఈసారి మరింత మందికి అవకాశం కల్పిస్తోంది.
Nova 2 Power 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను అందించనున్నారు. 6nm సాంకేతికతతో రూపొందిన ఈ చిప్‌సెట్ మల్టిపుల్ టాస్క్‌లు, గేమ్స్ ఆడటం వంటి వాటికి సరిపడే పనితీరును అందించనుంది. అయితే ఫోన్‌లోని ర్యామ్, నిల్వ సామర్థ్యం, బ్యాటరీ, తెర, కెమెరా వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఈ Nova 2 Power 5Gలో NxtQuantum OS పనిచేయనుంది. గోప్యత, వ్యక్తిగత సమాచార భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే ఈ వ్యవస్థను నెక్స్ట్‌క్వాంటం షిఫ్ట్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. ఈ ఫోన్ గోల్డెన్ బ్లూ ఫ్యూజన్, బ్లూ ఫ్యూజన్ రంగుల్లో రానుంది. అయితే ధర, విడుదల తేదీ, పూర్తి వివరాలను Ai+ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Also Read: ఫోన్ అప్‌డేట్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయాలా? చేయకపోతే ఏమవుతుందో తెలుసా?