E-Paper
Advertisement

అమెరికా టు ఆగ్రా వయా హైదరాబాద్.. నిఖిత హత్య కేసులో చిక్కిన మాజీ ప్రియుడు, యూఎస్‌కు తరలింపు?

అమెరికా టు ఆగ్రా వయా హైదరాబాద్.. నిఖిత హత్య కేసులో చిక్కిన మాజీ ప్రియుడు, యూఎస్‌కు తరలింపు?
Advertisement

Nikita Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మను ఆగ్రాలో అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. నాలుగు రోజుల కిందట అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు,  ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి నిందితుడ్ని అమెరికాకు తరలించనున్నారు. హైదరాబాద్ లాలాగూడ పీఎస్‌లో అర్జున్ శర్మపై కేసు ఉంది.

 

అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసు, మాజీ ప్రియుడి అరెస్ట్

Advertisement

అమెరికాలోని మేరీల్యాండ్‌లో గతేడాది 2025 డిసెంబర్ 31న తెలుగు యువతి నిఖిత హత్యకు గురైంది. నిఖితా అదృశ్యమైనట్లు జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్జున‌శర్మ. అయితే చివరిసారిగా డిసెంబర్ 31న తన అపార్ట్‌మెంట్‌లో యువతిని చూసినట్టు పోలీసులకు తెలిపాడు. మరుసటి రోజు పోలీసులు.. అర్జున్ ఉన్న ఫ్లాట్‌లో నిఖితా మృతదేహాన్ని గుర్తించడంతో షాకయ్యారు. యువతి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో ఆత్మహత్య కాదు, హత్య అని అమెరికా పోలీసులు నిర్థారించారు. నిఖితా అదృశ్యంపై ఫిర్యాదు చేసిన రోజు అర్జున్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశాడు. దీంతో అతడిపై పోలీసులకు మరింత అనుమానాలు పెరిగాయి.

అమెరికాలో ఏం జరిగింది?

తార్నాకకు ప్రాంతానికి చెందినది నిఖిత గొడిశాల. హత్యకు కారణమైన నిందితుడు అర్జున్‌‌శర్మ.. అమెరికా నుంచి భారత్‌కు వచ్చేశాడు. అప్పటి నుంచి పోలీసుల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అర్జున్ శర్మను గురువారం ఆగ్రాలోని ఒక ఫ్లాట్‌లో గుర్తించారు పోలీసులు. ఈ కేసులో అర్జున్‌పై హత్య కేసు కింద రకరకాల అభియోగాలు మోపారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో నిందితుడ్ని హాజరుపరిచారు. అమెరికాకు అప్పగింత అభ్యర్థనపై ప్రక్రియ కొనసాగుతోంది.

ఆర్థిక లావాదేవీలతో హత్య?

Advertisement

నిఖితా కుటుంబ సభ్యుల వెర్షన్. అర్జున్‌తో నిఖితకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయని అంటున్నారు. అర్జున్-అతడి కుటుంబ సభ్యులు నిఖితా కుటుంబం నుంచి మనీ తీసుకున్నట్లు యువతి తండ్రి ఆరోపించారు. డబ్బు తిరిగి చెల్లించే విషయంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. నిఖిత తండ్రి వాదనను అమెరికా పోలీసులు ఖండించారు. అర్జున్.. ఆమె ఫ్లాట్‌మేట్ మాత్రమేనని, గతంలో ఇద్దరూ కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉన్నారని తెలిపారు. మరి ఏం జరిగిందో ఆ తర్వాత..  నిఖితా మరొక అపార్ట్‌మెంట్‌కు మారిందన్నారు. నిఖితా మృతదేహం లభించిన తర్వాత అర్జున్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అమెరికా పోలీసులు. అర్జున్ కోసం గాలింపు కొనసాగతుండగా, ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అమెరికా అధికారుల సమాచారంతో తెలంగాణ పోలీసులు అర్జున్ కోసం వేట మొదలుపెట్టారు.

తార్నాకు చెందిన యువతి నిఖిత

హైదరాబాద్‌లోని తార్నాకు చెందిన నిఖితా 2021-22 సమయంలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేంది. మేరీల్యాండ్‌లోని డేటా అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతున్న సమయంలో హత్యకు గురైంది. ఆమె కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అమెరికాకు అప్పగించే ప్రక్రియ పూర్తయిన తర్వాత మేరీల్యాండ్‌లో నమోదైన హత్య కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ALSO READ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 30న ట్రాఫిక్ ఆంక్షలు

Related News

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Big Stories

Advertisement
×