E-Paper
Advertisement

LPG Statistics: దేశంలో గ్యాస్ సంక్షోభం.. LPG గురించి.. ఆశ్చర్యపరిచే వాస్తవాలు!

LPG Statistics: దేశంలో గ్యాస్ సంక్షోభం.. LPG గురించి.. ఆశ్చర్యపరిచే వాస్తవాలు!
Advertisement

LPG Statistics: పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య తలెత్తిన యుద్ధం.. ఎల్‌పీజీ గ్యాస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా భారత్ లో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడి.. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో.. చాటా చోట్ల హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌పీజీ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కీలక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎల్‌పీజీ ఎలా ఉత్పత్తి చేస్తారు?

ఎల్‌పీజీ అనేది సహజంగా లభించే వాయువు కాదు. దీనిని ప్రధానంగా రెండు పద్దతుల్లో వెలికి తీస్తారు. ఇందులో ఒకటి చమురు శుద్ధి కాగా, మరొకటి సహజ వాయువు వెలికితీత. చమురుశుద్ధి విషయానికి వస్తే.. భూమి నుండి తీసిన ముడి చమురును (Crude Oil) రిఫైనరీలలో వేడి చేసినప్పుడు వివిధ ఉష్ణోగ్రతల వద్ద పెట్రోల్, డీజిల్ వంటివి విడిపోతాయి. ఆ ప్రక్రియలోనే ఎల్‌పీజీ గ్యాస్ కూడా విడుదలవుతుంది. మరో పద్దతిలో భూగర్భం నుండి సహజ వాయువును తీసేటప్పుడు అందులో మిశ్రమంగా ఉన్న ప్రొపేన్, బ్యూటేన్‌లను వేరు చేసి ఎల్‌పీజీగా మారుస్తారు.

ఎల్‌పీజీ ఉత్పత్తిలో టాప్ దేశం ఏదంటే?

Advertisement

ఎల్‌పీజీ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ ఒక్క దేశం నుంచే ఏటా 84 మిలియన్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది మెుత్తం ఎల్‌పీజీ ఉత్పత్రిలో 26 శాతానికి సమానం. షెల్ గ్యాస్ విఫ్లవం తర్వాత.. అమెరికా పెద్ద ఎత్తున సహజవాయువుపై దృష్టి సారించింది. పెర్మియన్ బేసిన్, మార్సెల్లస్ షెల్ సహా యూఎస్ షెల్ బేసిన్ లలో సహజవాయువు ఉత్పత్తిని పెంచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ చమురు శుద్ధి కేంద్రాలు సైతం అమెరికాలోనే ఉండటం గమనార్హం. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా వంటి దేశాలుగా ప్రధాన గ్యాస్ ఎగుమతి దారుగా అగ్రరాజ్యం ఉంది. ప్రస్తుతం ఇరాన్ పై యుద్ధంలో అమెరికా కూడా తలమునకలైన నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా సహజవాయువు ధరలు పెరుగుతున్నాయి.

అమెరికా తర్వాత ఎవరంటే?

అమెరికా తర్వాత అత్యధికంగా ఎల్ పీజీ ఉత్పత్తి చేసే దేశంగా చైనా రెండో స్థానంలో ఉంది. డ్రాగన్ కంట్రీ ఏటా 32 మిలియన్ టన్నుల గ్యాస్ ను ఉత్పత్తి చేస్తోంది. దాని తర్వాత మూడో స్థానంలో సౌదీ అరేబియా (26 మిలియన్ టన్నులు), నాల్గో స్థానంలో రష్యా ఉన్నాయి. కెనడా, ఇరాన్, ఖతార్, యూఏఈ, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Advertisement

Also Read: Induction Stove: ఇండక్షన్ స్టౌ గురించి 10 సీక్రెట్స్ .. చాలా మందికి తెలియని నిజాలు !

మరి భారత్ సంగతేంటి?

ఇదిలా ఉంటే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుగా ఉంది. భారత్ అవసరాలకు సరిపడ సహజవాయువులు దేశంలో లేకపోవడంతో.. దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దేశంలో చమురు శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ ప్రొసెసింగ్ ప్లాంట్లు ద్వారా కొద్దిమేర ఎల్‌పీజీ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ అది భారత్ అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. అందుకే గల్ఫ్ దేశాల్లో చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా భారత్ కు సరఫరా అయ్యే ఎల్‌పీజీపై ప్రభావం పడింది. ఫలితంగా దేశంలో గ్యాస్ సరఫరాలో అనిశ్చితి ఏర్పడింది.

Also Read: Haier vs LG Fridge: మిడిల్ క్లాస్ మెచ్చిన బ్రాండ్స్.. డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లలో.. ఏది బెస్ట్ ఆప్షన్!

Related News

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ఛానెల్ ప్రారంభం.. ఒక్క క్లిక్‌తో అప్‌డేట్స్!

తెల్లవారుజామునే ఉద్యోగులకు భారీ షాకిచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. వేల సంఖ్యలో ఫైరింగ్

ఆసుపత్రి బిల్లు తగ్గాలంటే హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఈ 5 అంశాలు తప్పనిసరి.. మీ పాలసీలో ఉన్నాయా?

దిగొస్తున్న బంగారం ధర.. మహిళల్లో ఒక్కటే ఆనందం, ఇవాళ మార్కెట్ ధరల మాటేంటి?

కేంద్రం తీపి కబురు.. UPI యూజర్స్‌కు శుభవార్త, రూ. 2 వేలు వరకు లావాదేవీలు ఉచితం

‘హోటల్ ధర కంటే స్విగ్గీలో డబుల్ ధర.. ఇదిగో ప్రూఫ్’

ఆయిల్ మార్కెట్‌లో ప్రకంపనలు.. బ్యారెల్ ధర 108 డాలర్లు, భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్?

యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం

Big Stories

Advertisement
×