Haier vs LG Fridge: హైయర్, ఎల్జీ కంపెనీలకు చెందిన ఫ్రిడ్జ్ లకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. డబుల్ డోర్ సెగ్మెంట్ ఫ్రిడ్జ్ లలో ఈ కంపెనీకి చెందిన రెండు ఫ్రిడ్జ్ ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ‘Haier 325 L 3 Star Double Door’, ‘LG 322 L 3 Star Double Door’ మార్కెట్ లో పోటాపోటీగా సేల్ అవుతున్నాయి. ప్రస్తుత సమ్మర్ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది కొనాలన్న దానిపై చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. నేపథ్యంలో ఈ ఫ్రిడ్జ్ మధ్య ఫీచర్ల పరంగా ఉన్న తేడాలు? ఫైనల్ గా ఏది కొంటే బెటరో ఇప్పుడు పరిశీలిద్దాం.
హైయర్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. ఇది 325 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో బాటమ్ మౌంటెడ్ ఫ్రీజర్ (BMF) ఉండటం వల్ల మనం తరచుగా వాడే వెజిటబుల్ బాక్స్ పైభాగంలో ఉంటుంది. దీనివల్ల ప్రతీసారి వంగి తీయాల్సిన అవసరం ఉండదు. LG విషయానికి వస్తే.. ఇది 322 లీటర్ల సామర్థ్యంతో వచ్చింది. ఇది సాధారణంగా ఉండే టాప్ మౌంటెడ్ ఫ్రీజర్ మోడల్.
Haier ఫ్రిడ్జ్ లో ‘1-Hour Icing Technology’ ఉంటుంది. దీని ద్వారా కేవలం 60 నిమిషాల్లోనే ఐస్ తయారవుతుంది. ఎల్జీలో ‘Door Cooling+’, ‘Multi Air Flow’ సాంకేతికత ఉంది. ఇది ఫ్రిడ్జ్ లోపల అన్ని మూలలకు సమానంగా గాలిని పంపి ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు సాయపడుతుంది.
హైయర్ ఫ్రిడ్జ్ లో ’14-in-1 Convertible’ మోడ్స్ ఉంటాయి. అంటే మీ అవసరానికి తగ్గట్టుగా ఫ్రిడ్జ్ సెట్టింగ్స్‌ను 14 రకాలుగా మార్చుకోవచ్చు. అయితే ఎల్జీలో మాత్రం ‘Convertible 5-in-1’ మోడ్స్ మాత్రమే ఉంది. ఇది 5 రకాల కూలింగ్ మోడ్స్ ను అందిస్తుంది. ఇది సాధారణ వినియోగానికి ఎల్జీలోని ఈ ఫీచర్లు సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
హైయర్ ఫ్రిడ్జ్ లోని Twin Inverter Technology.. కంప్రెసర్, ఫ్యాన్ మోటార్ రెండింటినీ నియంత్రిస్తూ విద్యుత్ ను ఆదా చేస్తుంది. మరోవైపు ఎల్టీలో Smart Inverter Compressor ఉంటుంది. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తూ.. తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. దీనికి 10 ఏళ్ల వారంటీ కూడా ఉంటుంది.
హైయర్ ఫ్రిడ్జ్ కు గ్లాస్ ఫినిషింగ్ బాడీ ఉండటం వల్ల చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పెద్ద వెజిటబుల్ బాక్స్, టఫ్డ్ గ్లాస్ షెల్వ్స్ ఇది వస్తుంది. ఎల్జీలో Auto Smart Connect ఉంటుంది. ఇది పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంటి ఇన్వర్టర్‌కు కనెక్ట్ అవుతుంది. అలాగే ఎల్జీ ఫ్రిడ్జ్ లో స్మార్ట్ డయాగ్నోసిస్ ఫీచర్ కూడా ఉంది.
Also Read: Devi Sri- Thaman: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌కు సంగీత దర్శకులు ఎందుకు రాలేదో తెలుసా?.. కారణం ఇదే?
ఇంట్లో పెద్దవారు ఉండి, తరుచూ వంగి కూరగాయాలు తీయడానికి ఇబ్బంది పడుతుంటే హైయర్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మీకు బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. పైగా ఇందులో ఉన్న ఎక్కువ కన్వర్టిబుల్ ఆప్షన్స్, మోడ్రన్ గ్లాస్ లుక్ మీ కిచెన్ కు స్టైలిష్ లుక్ ను తీసుకొస్తుంది. అలా కాకుండా బ్రాండ్ వాల్యూ, మెరుగైన సర్వీస్ నెట్‌వర్క్, రిఫ్రిజిరేటర్ అంతటా సమానమైన కూలింగ్ (Door Cooling) కావాలనుకుంటే LG ఉత్తమమైన ఎంపిక. మీ అవసరాలు, అభిరుచులకు దగ్గర ఉన్నదానికి మీరే ఎంచుకోండి.
ముఖ్య గమనిక: హైయర్, ఎల్జీ ఫ్రిడ్జ్ ల మధ్య వ్యత్యాసాలను సదరు కంపెనీలు విడుదల చేసిన ఫీచర్ల ఆధారంగా అందించడం జరిగింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. ఫ్రిడ్జ్ ల ఫీచర్లకు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు.