BigTV English

Best Ladies Scooty: మహిళల కోసం బెస్ట్ స్కూటీలు.. ఈ ధరలో దొరకడం అదృష్టమే.. మైలేజీ అదుర్స్..!

Best Ladies Scooty: మహిళల కోసం బెస్ట్ స్కూటీలు.. ఈ ధరలో దొరకడం అదృష్టమే.. మైలేజీ అదుర్స్..!

tvs scooty pep plus and zest: ప్రస్తుత కాలంలో స్కూటర్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఎక్కువగా మహిళలు స్కూటర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి వద్ద పనులకు, ఉద్యోగాలు చేసే వారికి, పిల్లలను ఇంటి నుంచి స్కూల్‌కు డ్రాప్ చేయడానికి చాలా మంది స్కూటర్‌నే ఉపయోగిస్తున్నారు. అందువల్లనే దేశీయ మార్కెట్‌లో స్కూటర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా సిటీలో ఉండే వారికి స్కూటర్ ది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో స్కూటర్‌ వారికి చాలా మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.


అందువల్ల ఎప్పట్నుంచో ఒక మంచి మైలేజీ అందించే స్కూటర్‌ను తక్కువ ధరలో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్. తక్కువ ధరలో ఓ స్కూటర్ అందుబాటులో ఉంది. అది మరేదో కాదు. ప్రముఖ టీవీఎస్ మోటార్‌కి చెందిన స్కూటీ పెప్ ప్లస్. ఈ స్కూటీకి దేశీయ మార్కెట్‌లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు ఎంతో ఇష్టమైన స్కూటీగా గుర్తింపు పొందింది. ధర కూడా తక్కువగానే ఉండటంతో చాలా మంది దీనిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: బజాజ్ చేతక్ వేరే లెవెల్ అబ్బ.. ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్.. సింగిల్ ఛార్జింగ్‌పై 136 కి.మీ మైలేజ్..!


పెప్ ప్లస్ స్కూటీ దేశీయ మార్కెట్‌లో కేవలం రూ.63,060 నుంచి రూ.66,160 ధర మధ్య అందుబాటులో ఉంది. చాలా సింపుల్ అండ్ క్లాసిక్ లుక్‌లో ఉంటుంది. ఇది 87.8 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 5.43 పిఎస్ పవర్, 6.5 ఎన్ ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 50 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇలా తక్కువ ధర, ఎక్కువ మైలేజీతో ఈ స్కూటీ గత కొంత కాలంగా ఎక్కువ సేల్స్‌ను పొందుతుంది. ఈ స్కూటీ ఎల్‌ఈడీ డీఆర్ఎల్, హాలోజన్ హెడ్‌లైట్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంది.

ఈ స్కూటీ మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్, బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ వంటి సెటప్ అందించబడింది. అలాగే డ్రమ్ ఆప్షన్లు కూడా ఇందులో అమర్చారు. అయితే ఈ స్కూటర్‌తో పాటు మరో స్కూటర్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అది టీవీఎస్ స్కూటీ జెస్ట్. ఇది దేశీయ మార్కెట్‌లో రూ.72,614 నుంచి రూ.73,417 ధర మధ్య అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 109.7 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. లీటర్ పెట్రోల్‌తో 48 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ స్కూటర్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×