Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు లోహాల మార్కెట్‌పై పడింది. ఫలితంగా బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై పడింది. ఫలితంగా బంగారం ధర పతనమైంది. మరి మంగళవారం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి? బులియన్ వర్గాలు ఏం చెబుతున్నాయి? ఇవాళ ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కసారి పరిశీలిద్దాం.
అంతర్జాతీయ పరిణామాలు బంగారం మార్కెట్లపై పడ్డాయి. సేఫ్ జోన్‌లో ఉన్న బంగారం ధరలు పతనమవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కొనుగోలుదారులు ఎగిరిగత్తేస్తున్నారు. ప్రస్తుతం మదుపరుల దృష్టి ఈ వారం విడుదలయ్యే యూఎస్ సీపీఐ డేటాపైకి మళ్లింది. ద్రవ్యోల్బణ అంచనాలు అధికంగా ఉండడంతో ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాని ప్రభావం బులియన్ మార్కెట్‌పై పడింది.
అక్టోబర్ 13న అంటే మంగళవారం ఉదయం తొలి సెషన్‌లో బంగారం ధర ఔన్సుకు 4121 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కొంత పుంజుకుని ఔన్సుకు 4,182 నుంచి 4200 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డిసెంబర్ 4 డెలివరీకి సంబంధించిన MCX గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 1,49,525 వద్ద నిలకడగా ఉంది. వెండి ధర దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 0.28 శాతం తగ్గి కిలోగ్రాముకు రూ. 2,22,246 వద్దకు చేరింది. దేశీయంగా బంగారం- వెండి ధరలు తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. మంగళవారం ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,670గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ ధర రూ.1,37,190గా ఉంది. మరోవైపు వెండి ధర స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. కిలోకు వంద రూపాయల మేరా తగ్గి, హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది.
దేశీయంగా ధరల విషయానికి వద్దాం. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్- IBJA ప్రకారం.. సోమవారం మార్కెట్లో 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ1369 తగ్గి రూ. 1.49 లక్షలకు చేరింది. అదే కిలో వెండి ధర కూడా రూ. 814 తగ్గి రూ.2.39 లక్షలకు చేరింది. గతనెల ప్రారంభంలో బంగారం ధర రూ. 8000, వెండి ధర రూ. 15000 తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ. 2,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ ఔన్సుకు 60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో 24 గ్రాముల గోల్డ్ 10 గ్రాముల రేటు రూ. 1,49,670 కాగా, రూ.1,37,190 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో కాస్త తక్కువగా ఉంది. చెన్నై నగరంలో కాస్త ఎక్కువగా కనిపిస్తోంది.
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మూడేళ్లలో తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచడంతో బంగారం ధరలు పడిపోయాయని చెప్పారు. అమెరికా-ఇరాన్ యుద్ధం, ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారానికి మద్దతు లభించవచ్చు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని మరోసారి సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకోవచ్చని ఓ అంచనా. మార్కెట్ ఇంకా బలహీనత సంకేతాలను చూపించడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా గణనీయమైన తగ్గుదల వల్ల కొనుగోలు అవకాశాన్ని కల్పించవచ్చని చెబుతున్నారు.
ALSO READ: పండుగ వేళ ఇల్లు కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్.. బిల్డర్లు ఇచ్చే ఆఫర్లను నమ్మవచ్చా?