E-Paper
Advertisement

మ్యాచ్ మ‌ధ్య బిర్యానీ తిన్న ష‌మీ…బండ‌బూతులు తిట్టిన ర‌విశాస్త్రి!

మ్యాచ్ మ‌ధ్య బిర్యానీ తిన్న ష‌మీ…బండ‌బూతులు తిట్టిన ర‌విశాస్త్రి!
Advertisement

Ravi Shastri On Shami Biryani:  టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ బిర్యానీ తిన్నాడని ఒకప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి బండ బూతులు తిట్టినట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. పందుల్లా బిర్యానీలు తినడం కాదు… బౌలింగ్ సరిగ్గా వేయాలంటూ దారుణంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. మ్యాచ్ బ్రేక్ సమయంలో విపరీతమైన ఆకలి వేసిన నేపథ్యంలో బిర్యానీ లాగించేసాడని సమాచారం. ఈ తరుణంలో బిర్యానీ తింటున్న మహమ్మద్ షమీ, రవిశాస్త్రి కంట‌ పడినట్టు నివేదిక‌లు చెబుతున్నాయి. దీంతో మహమ్మద్ షమీని రవి శాస్త్రి బండబూతులు తిట్టినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన 2018 దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌విశాస్త్రి బ‌యట పెట్టారు. అన‌వ‌ర‌సంగా ఆ రోజున ష‌మీని అపార్థం చేసుకున్నాను, కానీ అదే మ్యాచ్ లో అత‌డు ఇర‌గదీసి మ్యాచ్ గెలిపించిన‌ట్టు వెల్ల‌డించారు. దీంతో ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది.

అసలు ఈ మహమ్మద్ షమీ బిర్యానీ పంచాయితీ ఏంటి ?

2018 సమయంలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( IND VS SA SERIES) మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. ఇందులో మూడో టెస్టు జోహెన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో నిర్వహించారు. ఆ సమయంలో టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రినే ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 100 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుంది. ఆ లోపు ఎనిమిది వికెట్లు టీమిండియా తీయాల్సి ఉంది. అంతలోనే లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ లంచ్ బ్రేక్ లో సాధారణంగా లైట్ ఫుడ్ తీసుకుంటారు. కానీ మహమ్మద్ షమీ మాత్రం ఏకంగా బిర్యానీ లాగించాడు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

అంతలోనే ఇది గమనించిన రవి శాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ను పిలిచి.. ష‌మీ ఎందుకు బిర్యానీ తింటున్నాడని నిలదీశాడు. ఆ తర్వాత నేరుగా ష‌మీ దగ్గరికి వెళ్లి… ఎందుకిలా చేస్తున్నావని గట్టిగానే కడిగేసాడట రవి శాస్త్రి. దీంతో విపరీతమైన కోపంతో ఉన్న మహమ్మద్ షమీ… దాన్ని దక్షిణాఫ్రికా ఆటగాళ్లపై చూపించాడు. ఆరు ఓవర్లు వేసి ఐదు వికెట్లు పడగొట్టి ఇండియాను గెలిపించాడు. అయితే ఇది చూసిన రవి శాస్త్రి మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత మళ్లీ షమీ కోసం ప్రత్యేకంగా బిర్యానీ చేయించాడట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కాగా టీమిండియా హెడ్ కోచ్ గా 2017 నుంచి 2021 న‌వంబ‌ర్ వ‌ర‌కు ర‌విశాస్త్రి ప‌ని చేశాడు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

బౌలర్‌గా సచిన్ కొడుకు పనికేరాడు…అన్ని మూసుకుని ఆ పని చేయాలి

ఒరేయ్ పంజాబీ అంటూ విరాట్ కోహ్లీ నన్ను అవమానించాడు

2027 వరల్డ్ కప్‌లో టీమిండియా, పాక్ మధ్య ఫైనల్స్ జరిగేలా ఐసీసీ కుట్రలు

సంజు బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారింది…ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదు

టీమిండియాలో సిక్స్ ప్యాక్ యుగం న‌డుస్తోంది.. వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం

క‌ళ్లు మూసుకుని ఆడ‌టం కాదు, అమీర్ బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడు…అభిషేక్ పై బాసిత్ ప్ర‌శంస‌లు

అందరూ ద‌ద్ద‌మ్మ‌లే.. ప‌ర్స‌న‌ల్ రికార్డుల కోస‌మే ఆడి, పాకిస్తాన్ కొంప‌ముంచుతున్నారు

Big Stories

Advertisement
×