Nayanatara : తమిళనాడు రాజకీయాలు రోజుకో విధంగా మారుతూ ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇటీవల కాలంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అందులోనూ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సీఎం అవ్వడంతో చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రాఘవ లారెన్స్, అజిత్ వంటి హీరోలు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార భర్త కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఆ వార్తలపై ప్రస్తుతం ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంతకీ నయనతార భర్త రాజకీయాల్లోకి వస్తున్నాడా?రావట్లేదా? అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలతో సమానంగా ఆమె రెమ్యూనరేషన్ తీసుకోవడంతో కొంతమంది షాక్ అవుతున్న కూడా.. మరి కొంత మంది మాత్రం ఆమెకున్న డిమాండ్ పెట్టి అంత తీసుకోవడం కరెక్ట్ అంటూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆమె తన భర్తతో కలిసి సినిమాలను నిర్మిస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు కొత్తగా ఆమె భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా న్యూస్ వినిపిస్తుంది. ఆ వార్తలపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మేము ఇప్పుడు మా పిల్లలు తో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. దయచేసి మీరు ఎవరు కొత్త రూమర్స్ ని క్రియేట్ చేయొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు అంటే రాజకీయాల్లోకి రావట్లేదు అని ఇండైరెక్టుగా చెప్పేసారన్నమాట.. తనకి ఈ క్లారిటీతో ట్రోలర్ కి గట్టి కౌంటర్ అయితే వచ్చేసింది.
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ యాక్టర్లు రాజకీయాల్లోకి రావాలి అని కోరికతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలకు అంకితం అయిపోయారు. ఇటీవల కాలంలో మాత్రం యంగ్ స్టార్స్ కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పటికే ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా పాలిటిక్స్ లోకి వచ్చేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని తెలుస్తుంది.. త్రిష, ధనుష్, శివ కార్తికేయన్ అలాగే విశాల్ తో పాటుగా రాఘవ లారెన్స్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటివరకు అయితే ఈ యాక్టర్స్ ఎక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. ఇకముందు ఎవరు కోలీవుడ్ లో పాలిటిక్స్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటారు చూడాలి. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..