E-Paper
Advertisement

టారిఫ్‌ల దెబ్బకు దిగొచ్చిన ఎస్సార్? అమెరికాలోనే భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు!

టారిఫ్‌ల దెబ్బకు దిగొచ్చిన ఎస్సార్? అమెరికాలోనే భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు!
Advertisement

Essar Group: భారత దిగ్గజ వ్యాపార సంస్థ ఎస్సార్ గ్రూప్‌ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. అమెరికాలోని తన అనుబంధ సంస్థ మొసాబి మెటాలిక్స్‌ ద్వారా 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయోవా రాష్ట్రంలో నిర్మించనున్న ఈ భారీ స్టీల్ ప్లాంట్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా నిలవనుందని ట్రంప్ తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి ఏడాది 10 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయనున్నట్లు స్వయంగా ప్రకటించారు.

అమెరికాలోకి భారీ పెట్టుబడులు

Advertisement

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 6 వేల తాత్కాలిక ఉద్యోగాలు.. పూర్తయిన తర్వాత మైనింగ్‌, తయారీ రంగాల్లో 2 వేల మందికి శాశ్వత ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ట్రంప్ టారిఫ్ విధానాల వల్లే అమెరికాలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. దిగుమతులపై సుంకాలు చెల్లించే బదులు.. అమెరికాలోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. స్టీల్ దిగుమతులపై అమెరికా ప్రస్తుతం 50 శాతం సుంకాలు అమలు చేస్తోంది. అయితే, సుంకాలు కొంతమేరకు కంపెనీలను స్థానిక తయారీ వైపు మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ.. అవే పెట్టుబడులకు ప్రధాన కారణమని చెప్పడం సరైంది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎస్సార్ గ్రూప్‌ పెట్టుబడి విషయంలోనూ.. అమెరికా టారిఫ్ విధానాలు ఒక కారణంగా అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దీర్ఘకాల వ్యాపార అవకాశాలు, అమెరికా మార్కెట్‌లో డిమాండ్ వంటి అంశాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: అత్యవసరంగా డబ్బు కావాలా? మీ పిపిఎఫ్ అకౌంట్ నుంచి ఈజీ లోన్ లభిస్తుందిగా

Tags

Related News

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

వరద గుప్పిట్లో బ్యాంకాక్ సిటీ.. 48 గంటల్లో 300 మి.మీ. వర్షం, విమానాల గురించి..

రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

Big Stories

Advertisement
×