E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Gold-Silver Prices: మార్కెట్లో బంగారం-వెండి ధరలు, సరైన సమయమంటున్న నిపుణులు, మళ్లీ పైకి ఎగబాకడం

Gold-Silver Prices: మార్కెట్లో బంగారం-వెండి  ధరలు, సరైన సమయమంటున్న నిపుణులు, మళ్లీ పైకి ఎగబాకడం
Advertisement

Gold-Silver Prices: బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయమా? మళ్లీ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉందా? ఆదివారం మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి? శుక్రవారం మార్కెట్లో ధరలు ఎందుకు పెరిగాయి? బులియన్ మార్కెట్ వర్గాలు ఏం చెబుతున్నాయి? ధరలు పెరిగే అవకాశముందా? అంటున్నాయి.

బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులు

Advertisement

ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఫలితంగా ప్రపంచ మార్కెట్ల అనిశ్చితికి కారణమవుతోంది. ముఖ్యంగా డాలర్ బలపడటంతో 4 శాతం పైగానే బంగారం ధరలు పతనమయ్యాయి. మరి బంగారం, వెండి ధరలు ఇంకా పతనం అవుతాయా?

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గడంతో శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్-ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆగస్టు నెలకు 0.75 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూనై నెలకు ఒక శాతానికి పైగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఆదివారం రోజు హైదరాబాద్ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,950గా ఉంది.

Advertisement

ఇదే సరైన సమయం.. మళ్లీ పైకి ఎగబాకడం ఖాయమన్న మార్కెట్ వర్గాలు

విజయవాడలో కూడా అదే పరిస్థితి నెలకొంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1,44,100 ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ. 1, 32,100 గా ఉంది. ముంబైలో 24 గ్రాముల బంగారం ధర రూ. 1,43,950 వద్ద ఉంది. 22 క్యారెట్ల ధర రూ. 1, 31,950 వద్ద ఉంది.

బెంగుళూరులో 10 గ్రాములు 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,43,950 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,31,950గా ఉంది. దక్షిణాదిలోని చెన్నై మార్కెట్ విషయానికి వద్దాం. 24 క్యారెట్ల.. 10 గ్రాములు ధర రూ. 1,45,860 కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల ధర రూ.1,33,700 గా కొనసాగుతోంది. కోల్‌కతా విషయానికి వద్దాం. 24 క్యారెట్ల.. 10 గ్రాములు ధర రూ. 1,43,950 ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ. 1,31,950గా ఉంది.

ALSO READ: 14 ఏళ్లకే AI స్టార్టప్ పెట్టేసిన బుడ్డోడు.. ఏకంగా బుర్జ్ ఖలీఫాలో ఆఫీసు, అతడు ఏం చేస్తాడంటే?

అమెరికా-ఇరాన్ శాంతి ప్రక్రియలో పురోగతి సాధించడంతో ఉద్రిక్తతలు తగ్గినట్టు ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ తగ్గిందన్నారు. ముడి చమురు ధరల తగ్గుతుండడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లు తగ్గవచ్చని అంటున్నారు.

భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ వైఖరిని దెబ్బతీసి, మదుపరులు పసిడి వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉండవచ్చని చెప్పుకొచ్చారు. కేడియా అడ్వైజరీ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అమిత్ గుప్తా వెర్షన్ మరోలా ఉంది. రాబోయే మూడు నెలల్లో గోల్డ్ తగ్గిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 1,60,000 వరకు పెరిగే అవకాశం అంచనా వేశారు.

దేశంలో వెండి ధర కిలోరూ. 2,40,000 వద్ద కొనసాగుతోంది. బంగారం కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో పెట్టుబడిదారులకు వెండి ఇప్పటికీ సాధారణ ఎంపికగా ఉంది. పారిశ్రామిక, తయారీ అవసరాల కోసం వెండికి ఉన్న డిమాండ్ ధరల హెచ్చుతగ్గులలో కీలక పాత్ర పోషిస్తుంది.

Related News

14 ఏళ్లకే AI స్టార్టప్ పెట్టేసిన బుడ్డోడు.. ఏకంగా బుర్జ్ ఖలీఫాలో ఆఫీసు, అతడు ఏం చేస్తాడంటే?

రియల్ ఎస్టేట్ బూమ్.. దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరు.. 19 శాతం పెరుగుదల, హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి పతనం.. ఇంకా పడే ఛాన్స్, 2025 తర్వాత తొలిసారి ఆ స్థాయికి

పొదుపుకు ఏ స్కీమ్ బెటర్.. ఆ మూడింటిలో ఎక్కువ రాబడి ఏది? నెలకు రూ.13 వేలు పైమాటే

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. 20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నోటీసులు

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు, అదెలా సాధ్యం, ఆర్‌బిఐ ఏం చెబుతోంది?

బంగారు ప్రియులకు శుభవార్త.. మార్కెట్లో పడిపోతున్న ధరలు, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

×