Gold Price Today: దసరా, దీపావళి పండగల సీజన్ మొదలుకావడంతో బంగారం ధర పెరుగుతోందా? బంగారం మరో రికార్డును బద్దలు కొడుతుందా? రెండు రోజుల్లో రూ. 4600 పెరగడం దేనికి సంకేతం? రానున్న పండగల్లో బంగారం కొనుగోలు చేసేవారికి షాక్ తప్పదా? బులియన్ వర్గాలు ఏమంటున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.
అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలహీనపడడం, ఇరాన్ యుద్ధం విషయంలో కేవలం ట్రంప్ మాటలకే పరిమితం కావడం, ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు మదుపరుల్లో ఏమాత్రం కనిపించలేదు. ఫలితంగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. దసరా నవరాత్రి ఉత్సవాలు, దీపావళి లాంటి పండుగలు వస్తున్న క్రమంలో ధరలు ఆకాశాన్ని తాకడం కొనుగోలుదారుల్లో నిరాశ మొదలైంది.
దీనికితోడు బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల దిగుమతులపై బ్యాంకులు-నామినేటెడ్ ఏజెన్సీలకు జీఎస్టీ మినహాయింపు రద్దు చేసింది కేంద్రం. దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ విధిస్తున్నట్లు ప్రకటనతో బంగారం-వెండి ధరలు పెరుగుతున్నట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 10న దేశంలోని తెలుగు రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో బంగారం-వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
శుక్రవారం బంగారం-వెండి ధరలు అమాంతంగా పెరిగాయి. రూ. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం రేటు రూ.1784 పెరిగి రూ. 1.5 లక్షలకు చేరింది. వెండి ధర అయితే ఏకంగా రూ. 4,000 పెరిగి రూ. 2.21 లక్షలకు చేరింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్-IBJA ప్రకారం ధరలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల మార్కెట్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇదే ధరలు కంటిన్యూ అవుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో న్యూఢిల్లీ 24 క్యారెట్ల మేలిమి 10 గ్రామలు ధర రూ. 1,50,870 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,38,310 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తా నగరాల్లో ఢిల్లీ కంటే రూ.100 తక్కువగా ఉంది. చెన్నైలో మాత్రం ఢిల్లీ ధర కంటే కాస్త ఎక్కువగా ఉంది. ఇక వెండి కిలో దాదాపు రూ. 4,000 పెరిగి రూ. 2.21 లక్షలకు చేరుకుంది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధర రూ. 16,231 పెరగగా, వెండి ధర రూ. 9,311 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర రూ. 1.33 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ. 1.50 లక్షలకు చేరింది. డిసెంబర్ 31న కిలో వెండి ధర రూ. 2.30 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ. 2.21 లక్షలకు చేరుకుంది.
ALSO READ: తాతల ఆస్తి రెండో భార్యకు రాసిచ్చిన భర్త.. కోర్టుకెక్కిన మొదటి భార్య కూతురు.. చివరికి ఏం జరిగిందంటే
భారతీయ కుటుంబాల వద్ద బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లు. అంటే రూ.450 లక్షల కోట్లు అన్నమాట. ఈ మొత్తం దేశ జీడీపీ 4.1 ట్రిలియన్ డాలర్లు. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు అందుకు కారణాలుగా చెబుతున్నారు. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. భారతీయ కుటుంబాల వద్ద సుమారు 34,600 టన్నుల బంగారం ఉందని ఓ అంచనా.