Jabardasth Comedian: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న బాబు (Babu) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రేమ, పెళ్లి గురించి బయటపెట్టారు. ముఖ్యంగా తనకు వార్నింగ్ ఇచ్చిన అమ్మాయితోనే ఇప్పుడు ఏడడుగులు వేయబోతున్నానని చెబుతూ.. ఆయన కళ్ళల్లో కనిపించిన ఆనందం అభిమానులను సైతం సంతోషానికి గురి చేసింది .
మరి బాబు వివాహం చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
జబర్దస్త్ లో రైటర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఆర్టిస్టుగా కూడా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు బాబు. దర్శకుడిగా మారి ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే వ్యక్తి తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్దస్త్ బాబు తన ప్రేమ , పెళ్లి గురించి బయటపెట్టారు. జబర్దస్త్ బాబు మాట్లాడుతూ..” నేను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాను. ఒక్క సినిమా అయినా చేసి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. ఆ కల నెరవేరింది. ఆ అమ్మాయి పేరు అమూల్య. లోకల్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తోంది. లాక్ డౌన్ కి ముందు టిక్ టాక్ లో రీల్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ అమ్మాయిని చూసి, ఇష్టపడి లైక్ తో పాటు కామెంట్స్ కూడా పెట్టేవాడిని.
ముఖ్యంగా ఆ సమయంలో ఆమెకు సుమారుగా 7 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉండే వాళ్ళు. నేను పెట్టిన మెసేజ్లను ఆమె పట్టించుకోలేదు. అయితే ఒకరోజు హైదరాబాదులో సడన్గా కనిపించింది. అప్పుడు వెళ్లి పలకరిస్తే ఏమంటుందో అనే కారణంతో ఆగిపోయాను. జబర్దస్త్లో నాకు ఫేమ్ వచ్చాక ఆమె నంబరు కనుక్కొని మరీ ఫోన్ చేశాను. అయితే ఏమనుకుందో తెలియదు కానీ కొన్ని రోజులు నా మాటలు నచ్చక బ్లాక్ లిస్ట్ లో పెట్టింది . వార్నింగ్ కూడా ఇచ్చింది. లాక్ డౌన్ అయ్యాక మళ్లీ నేనే కాల్ చేస్తే వాళ్ళ తమ్ముడు లిఫ్ట్ చేసి నాకు తన నెంబర్ ఇచ్చాడు. ఆ టైంలో ఆమె హైదరాబాదులోనే ఉంది. ఫోన్ చేసి మామూలుగా మాట్లాడి, కలిసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ట్రావెల్ చేసాము. ఆ తర్వాతే లవ్ మొదలైంది .
also read: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!
తను చాలా మంచి అమ్మాయి. నాకోసం వెయిట్ చేసింది. ఇద్దరు ఇళ్లల్లో ఒప్పుకున్నారు. అయితే నా దగ్గర డబ్బులు లేనప్పుడు తనే నాకు డబ్బులు పంపించేది. లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కూడా ఇచ్చింది. 5 నెలల శాలరీ తనకు అది. నేను మంచి రీల్స్ చేయడానికి , ఫోటోలు తీయడానికి , జబర్దస్త్ లో ఉంటాను అని చెప్పి వద్దన్నా సరే ఐఫోన్ కొనిచ్చింది. ముఖ్యంగా నా బాగోగులు ఆమె చూసుకుంటుంది. అంతకంటే మంచి అమ్మాయిని నేను ఎక్కడ తీసుకురాలేను. ముఖ్యంగా ఆమె నా జీవితంలోకి రావడమే నా అదృష్టం. త్వరలోనే నేను ఆమెను వివాహం చేసుకోబోతున్నాను” అంటూ బాబు తెలిపారు. మొత్తానికైతే తాను ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నారు బాబు.