E-Paper
Advertisement

సామీ.. జీతాలు చెల్లించండి! GHMC అధికారులను నిలదీసిన బీఎంఎస్ నేతలు

సామీ.. జీతాలు చెల్లించండి! GHMC అధికారులను నిలదీసిన బీఎంఎస్ నేతలు
Advertisement

GHMC Salaries: స్వేచ్ఛ బ్యూరో: అక్టోబర్ మాసం మొదలై ఆరు రోజులు గడుస్తున్నా, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల ఖాతాల్లోకి జీతాలు ఇంకా క్రెడిట్ కాకపోవటంతో బీఎంఎస్ గుర్తింపు పొందిన భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ టి. కృష్ణ, సెక్రటరీ మనోరమా సోమవారం అధికారులు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక క్రమంలో వారు అదనపు కమిషనర్ (ఫైనాన్స్) ను నిలదీశారు. జీతాలు క్రెడిట్ అయ్యేందుకు ఇంకా వారం, పది రోజుల సమయం పడుతుందని అదనపు కమిషనర్ వెల్లడించటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యూనియన్ నేతలు నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ను కలిశారు.

జీతాలు చెల్లించకపోవటానికి కారణమేమిటీ?

Advertisement

అసలు జీతాలు చెల్లించకపోవటానికి ప్రధాన కారణమేమిటీ? అని ప్రశ్నించారు. మిగిలిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నెల 1వ తేదీన జీతాల చెల్లింపు ప్రక్రియ పూర్తయినా, క్యూర్ సిటీలోని అతి పెద్ద కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీలో ఎంధుకు సకాలంలో జీతాలు చెల్లించటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పెద్దల పూజలు మొదలయ్యాయని, ఈ నెలలో దసరా పండుగతో పాటు నవరాత్రి ఖర్చులుంటాయన్న విషయాన్ని గుర్తించి వెంటనే జీతాలు చెల్లించాలని పలు సార్లు అదనపు కమిషనర్ ను కలిసి కోరినా, ఆమె స్పందించటం లేదని, సోమవారం స్పందించిన అదనపు కమిషనర్ జీతాలు చెల్లించేందుకు మరో వారం, పది రోజుల సమయం పడుతుందని చెప్పిన విషయాన్ని యూనియన్ నేతలు కమిషనర్ కర్ణన్ కు వివరించగా, మంగళవారం సాయంత్రం కల్లా ఉద్యోగులు, కార్మికులందరికీ జీతాల చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు వివరించారు.

యూనియన్ నేత మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా యూనియన్ నేతలు టి. కృష్ణ, మనోరమా మాట్లాడుతూ చాలా మంది పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులు సైతం ప్రతి నెల జీతంపైనే ఆధారపడి ఇంటికి అవసరమైన వాహానం, ఎలక్ట్రానిక్ పరికరాలను ఈఎంఐలపై కొనుగోలు చేశారని, వారందరు ప్రతి నెల 2,3,5 వ తేదీల్లో వివిధ బ్యాంకులను బట్టి ఈఎంఐలను చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు 550 మంది ఉద్యోగుల చెక్ లు బౌన్స్ అయ్యాయని, ఇంకా వందలాది మంది పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల ఈఎంఐలు కూడా బౌన్స్ అయి, వారి ఖాతా సిబిల్ స్కోర్ పడిపోయిన విషయాన్ని వారు కమిషనర్ కు వివరించారు.

కమిషనర్ కు వివరణ..

ఈఎంఐలు బౌన్స్ అయి, ఉద్యోగులకు పెనాల్టీలు పడుతున్నట్లు ఆయన వివరించారు. చాలా మంది ఉద్యోగుల సిబిల్ రేటు కూడా పడిపోవటంతో బ్యాంక్ లోన్ వంటివి మంజూరు కావటం లేదని కృష్ణ వివరించారు. రిటైర్డు అయిన ఉద్యోగుల్లో నూటికి తొంభై శాతం మంది రిటైర్డు ఉద్యోగులు పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్నారని, వీరిలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని కూడా వారు కమిషనర్ కు వివరించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ మంగళవారం సాయంత్రం కల్లా ఉద్యోగులందరికీ జీతాల చెల్లింపులు జరపనున్నట్లు హామీ ఇచ్చినట్లు యూనియన్ నేతలు తెలిపారు.

Also Read: నవంబర్ నుంచి విద్యుత్ బిల్లుల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే?

Tags

Related News

నవంబర్ నుంచి విద్యుత్ బిల్లుల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే?

మహిళా టెక్కీ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘటన

తెలంగాణ పశుపోషకులకు బిగ్ షాక్.. 12 ఏళ్లయినా తప్పని తిప్పలు!

ఫ్రీ బస్సు పథకం ఎఫెక్ట్.. కేవలం 3 నెలల్లో రికార్డును బ్రేక్ చేసిన టీజీఎస్ఆర్టీసీ!

వృద్ధులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో జపాన్ తరహా హెల్త్ ప్లాన్!

సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240.. సామాన్యుడు ఎలా బతకాలి? రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ప్రశ్నల వర్షం

Big Stories

Advertisement
×