BigTV English

Biggest Gold Mines: దేశంలో బయటపడుతున్న బంగారు గనులు.. ఈ ప్రాంతాల్లో టన్నుల కొద్ది పసిడి నిక్షేపాలు..

Biggest Gold Mines: దేశంలో బయటపడుతున్న బంగారు గనులు.. ఈ ప్రాంతాల్లో టన్నుల కొద్ది పసిడి నిక్షేపాలు..

Indian Biggest Gold Mines: బంగారం.. దీనికి భూమిపై డిమాండ్ ఎక్కువ.. భూమిపై దొరికే లోహాలలో అత్యంత విలువైన వాటిల్లో ముందు వరుసలో ఉండే గోల్డ్. వందలు, వేల ఏళ్లు అయినా బంగారం రంగు మారదు. అలానే తళతళా మెరుస్తది.. అందుకే మగువలు గోల్డ్ ను ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దేశంలో పసిడి ధర లక్ష దాటినా కొనేందుకు మాత్రం భయపడేదేలే.. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా గోల్డ్ కొనాల్సిందే.. ఒంటిపై ధరించాల్సిందే. పురుషులు కన్నా ఎక్కువగా స్త్రీలు బంగారం ధరంచేందుకు ఇష్టపడుతుంటారు. ఇక వాళ్లకు బంగారం కొనిస్తే చెప్పలేనంత ఆనందంగా ఫీల్ అవుతారు. అందుకే మన దేశంలో బంగారానికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఇటీవల మన దేశంలో భారీగా బంగారు గనులు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జొన్నగిరి బంగారు గనులు, మధ్యప్రదేశ్ లో జబల్ పూర్ ప్రాంతంలో ఇటీవల కనుగొన బడిన గనులు, కర్నాటక పలు ప్రాంతాల్లో కేజీఎఫ్ లాంటి బంగారు గనులు ఎంతో ప్రసిద్ధి గాంచినవి. తాజాగా ఒడిశాలో కూడా బంగారు గనుల నిక్షేపాలు కనుగొనబడ్డాయి. ఇక దేశంలోనే ఎక్కువ బంగారు నిక్షేపాలు కర్నాటక రాష్ట్రంలో బయట పడ్డాయి. ఇప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా బంగారు గనులు ఉన్నాయి..? ఇటీవల బయటపడిన పసిడి నిక్షేపాల గురించి తెలుసుకుందాం. ఇవ్వన్నీ క్లియర్ కట్ గా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తీరాల్సిందే..


కర్నాటక..

మనదేశంలో కర్నాటక రాష్ట్రంలో ఎక్కువ బంగారు గనులు నిక్షిప్తమై ఉన్నాయి. అతి ముఖ్యమైన బంగారు ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా రాయచూరు, ధార్వాడ్, కోలార్ జిల్లాలలోని గనులు ఉన్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ గాంచిన బంగారు గని. ఇది అత్యంత లోతైన బంగారు గని. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో ఈ గనులు ఉన్నాయి. రాష్ట్రంలో రెండోది హుట్టి గోల్డ్ మైన్స్. ఇది దేశంలో క్రీయాశీల బంగారు గనుల్లో ఒకటి. హుట్టి గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (HGML) నిర్వహణలో ఆధునిక సాంకేతికతతో బంగారం సేకరిస్తున్నారు.


ఆంధ్రపదేశ్..

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి బంగారు గనులు ప్రసిద్ది గాంచినవి. ఈ బంగారు గనులు దేశంలోనే ప్రముఖమైనవి. ఇవి దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) ఆధ్వర్యంలో బంగార గనులు పనిచేస్తున్నాయి. ఈ బంగారు గనికి సంబంధించి 250 ఎకరాల భూసేకరణ, 60% ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యాయి. ఈ గోల్డ్ మైన్ దేశంలో ప్రైవేట్ రంగంలో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. జొన్నగిరి బంగారు గనులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడే అవకాశం ఉంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు ఇక్కడ గణనీయమైన బంగారు నిల్వలను గుర్తించిన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా తహసీల్‌లోని మహాగవాన్ కియోలారి గ్రామం సమీపంలో ఇటీవల భారీగా బంగారు నిక్షేపాలను గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్వహించిన సర్వేలో ఈ బంగారు నిల్వలు సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ భారతదేశ బంగారు ఉత్పత్తిలో గేమ్‌ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని ప్రముఖులు చెబుతున్నారు. తవ్వకాలు విజయవంతమైతే.. స్థానిక ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, విదేశీ మారక ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి తవ్వకాల ప్రణాళిక రూపొందించేకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ గనులు దేశ ఆర్థికాభివృద్ధికి, ముఖ్యంగా జబల్‌పూర్‌ను బంగారు కేంద్రంగా మార్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

జార్ఖండ్..

జార్ఖండ్‌లో బంగారు గనులు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని పరాసి బంగారు గని.. చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ గణనీయమైన ఖనిజ సంపదను కలిగి ఉంది. ఈ గనులలో బంగారంతో పాటు రాగి నిల్వలు కూడా ఉన్నాయి. ఇవి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతోగానూ తోడ్పడుతున్నాయి. జార్ఖండ్‌లో బంగారు నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ గనులు స్థానిక ఉపాధి అవకాశాలను పెంచుతాయి. భవిష్యత్తులో మరింత అభివృద్ధితో, ఈ గనులు జార్ఖండ్‌ను బంగారు ఉత్పత్తిలో ముఖ్యమైన కేంద్రంగా మార్చేందకు ఆస్కారం ఉంది. ఈ గనులు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి.

ALSO READ: Indian Air Force: భారత వాయుసేనలో నాన్- కంబాటెంట్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. జీతం రూ.30వేలు

ఒడిశా

తాజాగా ఒడిశా రాష్ట్రంలో బంగారు గనులను గుర్తించారు.  రాష్ట్రంలో ఇటీవల భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు బయటపడింది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఇక్కడ బంగారు నిక్షేపాలు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర భూగర్భ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా రాష్ట్రంలో సుందర్‌గఢ్, కియోంఝర్, దేవగఢ్ జిల్లాల్లో పసిడి నిక్షేపాల కోసం పెద్ద ఎత్తున అన్వేషణ జరుగుతోంది. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి ఈ పరిశోధనలను జరుపుతోంది.

ALSO READ: Head Constable Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసై ఉంటే చాలు, పూర్తి వివరాలివే

ఉత్తరప్రదేశ్..

ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో 2020 సంవత్సరంలో్ భారీగా బంగారు నిక్షేపాలు గుర్తించారు. ఇక్కడ సుమారు 3,000 టన్నుల బంగారం ఉందని అంచనా వేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), యూపీ గనుల శాఖ సంయుక్త సర్వేలో ఈ పరిశోధన జరిగింది. ఈ గనులు విజయవంతంగా తవ్వకం జరిగితే.. రాష్ట్ర ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ నిక్షేపాల విలువ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ గనులను వేలం వేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది దేశ బంగారు ఉత్పత్తిని పెంచే దిశగా ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు.

Related News

GST: కొత్త జీఎస్‌టీ ఎఫెక్ట్.. వీటి ధరలు బాగా తగ్గుతాయట.. అవి మాత్రం కాస్ట్లీనే!

Amazon Appstore: అమెజాన్ యాప్‌స్టోర్‌కు గుడ్‌బై.. ఇకపై శాశ్వతంగా మూత.. డేట్ కూడా ఫిక్స్!

BSNL Offers: BSNL రూబీ ప్లాన్ విడుదల, జియో, ఎయిర్ టెల్ కు దబిడి దిబిడే!

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

Big Stories

×