OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో, షాకింగ్ విజువల్స్‌తో ఆడియన్స్‌ని పారిపోయేలా చేసిన ఒక సినిమాగురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ సినిమా జర్మన్ మూవీ మలేషియా, సింగపూర్, కెనడాలాంటి దేశాల్లో బ్యాన్ అయ్యింది. కానీ కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. దీనికి కారణం దీనిలో ఉండే క్రూరమైన కంటెంట్. ఇందులో ఒక జంట శవాలతో పాడుపనులు చేస్తుంటారు. మనుషులను చంపి అవయవాలను భద్రపరుస్తుంటారు. ఈ సీన్స్ చూడలేక చాలామంది థియేటర్లనుంచి పరుగులు పెట్టారు కూడా. పిల్లలకు మాత్రం డైరెక్ట్ గానే ఈ సినిమా నిషిద్ధం. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
రాబర్ట్ ష్మాడ్ట్‌కే బెర్లిన్‌లో ఒక రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత క్లీనప్ చేసే జోస్ స్ట్రీట్ క్లీనింగ్ ఏజెన్సీలో పనిచేస్తాడు. అతనికి అతని గర్ల్‌ఫ్రెండ్ బెట్టీ కి నెక్రోఫిలియా అనే వింత మానసిక జబ్బు ఉంటుంది. దీనివల్ల మనుషులను చంపి వాళ్ళ శరీర భాగాలతో సైకో ఆనందం పొందుతుంటారు. వాళ్ల ఇంట్లో మనుషుల శరీర భాగాలను, నీళ్లలో భద్రపరిచిన జాడీలలో పెట్టివుంటారు. హత్యలు చేసినవాళ్ల ఫోటోలు కూడా ఉంటాయి. ఒక రోజు, రాబర్ట్ ఒక లేక్‌లో దొరికిన కుళ్లిన మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తాడు. బెట్టీకి గిఫ్ట్‌గా ఇస్తాడు. బెట్టీ ఆ మృతదేహాన్ని చూసి ఎగ్జైట్ అవుతుంది. వాళ్లిద్దరూ దానితో పైశాచిక ఆనందం పొందుతారు. కుళ్లిన శరీరంతో వీళ్ల రొమాన్స్ పీక్స్‌కి చేరుతుంది.
కానీ రాబర్ట్ జాబ్‌లో ఆలస్యంగా రావడం, అతని నుంచి వచ్చే దుర్వాసన కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. బెట్టీ అతనిపై కోపంతో, ఆ మృతదేహాన్ని తీసుకొని వెళ్లిపోతుంది. రాబర్ట్ ఒంటరితనంలో, డిప్రెషన్‌లో మునిగిపోతాడు. తన పెంపుడు పిల్లిని క్రూరంగా చంపి, దాని శరీర భాగాలతో స్నానం చేస్తాడు. అతను మద్యం మత్తులో ఒక వేశ్యను తీసుకెళ్లి, ఆమెను చంపేసి, ఆమె మృతదేహంతో అలాంటి పని చేంతాడు. తెల్లవారుజామున ఒక వ్యక్తి అతన్ని చూస్తాడు. వెంటనే రాబర్ట్ అతన్ని గోడలితో చంపేస్తాడు. ఇక చివర్లో రాబర్ట్ తన ఇంట్లో కత్తితో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత, ఒక అజ్ఞాత వ్యక్తి రాబర్ట్ సమాధిని తవ్వుతూ కనిపిస్తాడు. అంటే రాబర్ట్ లా మరొకరు ఉన్నట్లు చూపిస్తూ స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ కథ సైకలాజికల్ డిప్రెషన్ ను డిస్టర్బింగ్‌గా చూపిస్తుంది.
ఎందులో ఉందంటే
‘నెక్రోమాంటిక్’ (Nekromantik) అనేది జర్మన్ హారర్ ఎక్స్‌ప్లాయిటేషన్ సినిమా. జార్గ్ బట్గెరైట్ డైరెక్ట్ చేసిన కల్ట్ క్లాసిక్. నెక్రోఫిలియా డార్క్ థీమ్స్‌తో ఈ సినిమాల కంట్రోవర్షియల్‌గా నిలిచింది. ఇందులో బెర్న్డ్ డక్టరీ లోరెంజ్ (రాబర్ట్ ష్మాడ్ట్‌కే), బీట్రిస్ మనోవ్స్కీ (బెట్టీ) ప్రధాన పాత్రల్లో నటించారు. 1988 జనవరి 29న బెర్లిన్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం Shudder, AMC+, Arrow Videoలో హిందీ, ఇంగ్లీష్ ఆడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్