Gold Rates: మెున్నటి వరకు లక్షకు చెరువలో ఉన్న గోల్డ్ రేట్స్ తగ్గుముఖం పడుతున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,730 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ, 82,250గా ఉంది. అంటే సుమారు రూ.3 వేలు తగ్గింది. దీంతో పసిడి ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు కొనడం మంచిదా కాదా అనే గందరగోళం కొనుగోలుదారుల్లో ఉంది. సోమవారం బంగారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,380 ఉంది. 22 క్యారెట్లు తులం బంగారం.. రూ.82,850 ఉంది.
సోమవారంతో పోల్చితే.. మంగళవారానికి తులంపై మరో రూ.600 వరకు ధర తగ్గడం శుభసూచకం. ఇలాగే తగ్గుముఖం పడితే.. జనాలు మళ్లీ బంగారం కొనుగోలుపై మొగ్గు చూపుతారు. అయితే, ప్రస్తుతం బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. ట్రంప్ వల్ల ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
పసిడి ప్రియులకు శుభవార్త.. మెున్నటి వరకు లక్షకు చెరువలో ఉన్న బంగారం ధరలు ప్రస్తుతం దిగస్తున్నాయి. కని విని ఎరుగని రీతిలో 3 రోజుల్లోనే అత్యధికంగా బంగారం ధరలలో మార్పులు చూస్తున్నాము. 5 రోజుల క్రితం 24 క్యారెట్ల తులం బంగారం ధర 93,800 ఉండగా.. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర 89,730కి తగ్గింది. అంటే సుమారు రూ.4000 వరకు తగ్గింది.
మళ్లీ పెరగవచ్చా?
బంగారం కానీ, సిల్వర్ కానీ కొనాలనుకునే వారు ఇప్పుడే కొనేస్తే చాలా మంచిది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మున్ముందు కూడా అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు రానున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్ కుప్పకూలిన నేపథ్యంలో బంగారం, సిల్వర్‌లపై పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. కాబట్టి.. తగ్గినప్పుడే కొనేయడం బెటర్. తర్వాత పెళ్లిల్ల సీజన్లు వచ్చేసరికి బంగారం మరింత పెరిగిపోయే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.
Also Read: మండే మార్కెట్ ఎఫెక్ట్.. సంపద కోల్పోయిన భారత కుబేరులు