Gold Rates Dropped: వారెవ్వా.. భారీగా తగ్గుతున్న పసిడి ధరలు.. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడంతో సగటు వినియోగదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఒకానొక దశలో భారీగా పెరిగిన ధరలు చూసి భయపడిన పసిడి ప్రియులు.. ప్రస్తుత క్షీణతతో బంగారం ధరలు మళ్లీ మునుపటి సాధారణ స్థాయికి (లక్ష లోపు) చేరుకుంటాయని గట్టిగా నమ్ముతున్నారు.
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,040 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,780 వద్ద పలుకుతుంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,200 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,050 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,260 తగ్గింది.
అయితే, ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ మార్కెట్లో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో పసిడి రేట్లు మరింత దిగివచ్చే అవకాశం ఉందన్న అంచనాలతో పాటు, ప్రధాని మోదీ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటూ చాలా మంది కొనుగోలుదారులు ప్రస్తుతానికి తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. రేట్లు ఇంకా తగ్గుతాయనే నిరీక్షణే మార్కెట్లో ఈ స్తబ్దతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అంతేకాకుండా.. ఈ తగ్గుదల సాధారణ కొనుగోలుదారులను వెనక్కి తగ్గించినా, ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉన్నవారికి మాత్రం ఇది పెద్ద ఊరటగా మారింది. ముహూర్తాలు దగ్గరపడుతుండటం, బంగారం కొనడం తప్పనిసరి కావడంతో వారు ఈ తగ్గిన ధరలను అనుకూలంగా మార్చుకుంటూ షాపింగ్‌కు క్యూ కడుతున్నారు. పసిడి మార్కెట్ ఒడిదుడుకులు ఎలా ఉన్నప్పటికీ.. రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా డిమాండ్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి, భారీగా కాకపోయినా అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,780 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,050 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,780 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,050 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,780 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,050 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,930 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,29,200 వద్ద ఉంది.
నేటి సిల్వర్ ధరలు..
బంగారం ధరలు భారీగా తగ్గుతున్న వెండి ధరలు మాత్రం నిశ్చలంగా ఉన్నాయి. నేటి ధరలు చూసుకుంటే.. కేజీ సిల్వర్ రూ. 2,45,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో ఒకేసారి కేజీపై రూ. 5,000 పెరిగి ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద పలుకుతోంది.
Also Read: పాక్‌లో చొరబడి ఐసిస్ నెట్‌వర్క్‌పై అఫ్గాన్ మెరుపు దాడులు.. అసలు కారణం ఇదే!