Gold Rate: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. రోజు రోజూకు పసిడి ప్రియులకు బంగారం ధరలు దడ పుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన బంగారం మళ్లీ వరుసగా పెరగుతున్నాయి. అయితే నిన్న బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,330 ఉండగా.. నేడు గురువారం రూ. 1.02,550 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 93,800 ఉండగా నేడు రూ. 94,000 ఉంది. అంటే తులం పై రూ.220 పెరిగింది.
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. రోజురోజుకు గోల్డ్ రేటు పెరుగుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో భారత దేశంలో బంగారం, వెండిని.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఒక అడపిల్ల పెళ్లీ చేయాలంటే దేవుడా అంటూ జనం వాపోతున్నారు. అలాగే పెళ్లిళ్లలో ఇంక బంగారం కొనడం కలే అంటున్నారు.. మరికొందరు.. గోల్డ్ గురించి మర్చిపోండంటూ సలహా ఇస్తున్నారు.
అయితే బంగారం రేట్లు ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాదేస్తున్న ట్రంప్, మరోవైపు తమ దేశంలోని సెంట్రల్‌బ్యాంక్‌ను కూడా టెన్షన్ పెడుతున్నారు. దీంతో బంగారం రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి.
పలు ప్రాంతాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ నేటి బంగారం ధరలు
నిన్నటి బంగారంతో .. నేటి బంగారం ధరలు పోల్చగా నిన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,330 కాగా.. నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,550 వద్ద కొనసాగుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,800 కాగా.. నేడు రూ.94,000 పలుకుతోంది.
విశాఖపట్నం బంగారం ధరలు
విశాఖలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,550ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,000 వద్ద ఉంది.
విజయవాడలో బంగారం ధరలు
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,550 కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర తులం బంగారం ధర రూ.94,000 వద్ద కొనసాగుతోంది.
ముంభై బంగారం ధరలు
ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,550 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,000 వద్ద పలుకుతోంది.
ఢీల్లీ బంగారం ధరలు
ఢీల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,700 కాగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,150 వద్ద ఉంది.
Also Read: ఇదెక్కడి ఘోరం.. బర్త్ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తే డెత్ సర్టిఫికెట్..?
నేటి వెండి ధరలు..
వామ్మో.. బంగారమే అనుకుంటా.. దానికి మించి పోతుంది వెండి ధరలు.. వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. నేడు వెండి కేజిపై రూ.1000 పెరిగింది. దీంతో నేటి కేజి వెండి ధర రూ.1,27,000 వద్ద పలుకుతోంది. అలాగే.. ఢిల్లీ, కలకత్త, ముంభై ప్రాంతాల్లో రూ.1,17,000 కొనసాగుతోంది.