Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. బంగారం ధర మళ్లీ పెరిగింది. గత కొద్దిరోజులుగా పసిడి ధరలు భారీగా దిగొస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు(జూన్11th) బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి సడెన్ షాకిచ్చింది. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.820 పెరిగి, 98,400 కు చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,200 కు చేరుకుంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా, వాణిజ్య ఒప్పందాల మధ్య అస్థిరత కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
యుద్ధ భయాలు, గెపోలిటికల్ టెన్షన్లు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు.. సురక్షిత పెట్టుబడిగా బంగారాన్నే ఎంచుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు బంగారం విలువను పెంచాయి. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, డాలర్ మారకం విలువ, గ్లోబల్ అస్థిరతలు వంటి అంశాలే ప్రధాన కారణాలు.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,200 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,200 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,400 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,400 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,550 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,200కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,400 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: తెలంగాణలో హ్యూండాయ్ భారీ ప్రాజెక్టు.. రూ8 వేల కోట్లతో పెట్టుబడి, ఆ కంపెనీ ప్రతినిధుల రాక
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,18,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,07, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.