Gold Rate Today: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గి సామాన్యులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1, 01,510 కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,050 వద్ద ట్రేడ్ అవుతోంది.
కాగా బాంబుల మోతలతో.. పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ప్రపంచ దేశాలను హెచ్చరికలను లెక్క చేయకుండా.. ఇరాన్‌పై.. ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే.. ఇజ్రాయెల్ చెప్పి మరీ.. ఎటాక్ చేయడమే.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో.. తమ అణు స్థావరాలపై దాడులను.. ఇరాన్ ఎందుకు అడ్డుకోలేకపోయిందన్నది కూడా చర్చకు దారితీస్తోంది.
ఆపరేషన్ రైజింగ్ లయన్‌తో.. ఇజ్రాయెల్.. ఇరాన్‌కు షాకిచ్చింది. తమ శత్రు దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు.. ఇజ్రాయెల్ అనేక మోసపూరిత వ్యూహాలను ఉపయోగించింది. ఇందులో డ్యామేజ్ లిమిటేషన్ వ్యూహం ఒకటి. ఇరాన్ తనపై దాడికి సిద్ధంగా ఉందని.. అందువల్ల.. ఇజ్రాయెల్ తమ రక్షణను పటిష్టం చేసుకుంటోందని నమ్మించింది. దాంతో.. ఇరాన్ కాస్త రిలాక్స్ అయ్యేలా చేశారు.
ఇదిలా ఉంటే.. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు సంకేతాలివ్వడంతో.. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి తగ్గిస్తున్నారు. దీంతో ధరలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,050 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,510 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,050 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,510 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,510 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,050 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,510 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,050 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,510 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,510 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక యుపిఐ లావాదేవీలు సూపర్ ఫాస్ట్..
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా.. వెండి ధరలు కాస్త్త ఊరటనిచ్చాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,19,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,09, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.