Gold Rate Today: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. డాలర్ మారకం విలువ కోలుకోవడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్(Gold Rate ).. గరిష్ట స్థాయి నుంచి స్వల్పంగా తగ్గింది. ఈ ప్రభావం దేశీయ మర్కెట్లో కూడా కనపించింది.
22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,900 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99, 170 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ బలపడితే, ఇతర దేశాల కొనుగోలుదారులకు బంగారం ఖరీదు పెరుగుతుంది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి.
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే, పెట్టుబడిదారులు బంగారంలో కాకుండా వడ్డీ వచ్చే ఆస్తులవైపు మొగ్గుచూపుతారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధాలు, ఆర్థిక మందగమనం లాంటి గందరగోళం మధ్య.. బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లు బాగా పెరుగుతున్నప్పుడు, పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడం తగ్గిస్తారు. కాగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. రెండు నెలల్లో బంగారం ధరలు 12–15% తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.
ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిసీలిద్దాం.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,170 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,900 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,170 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,900 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,170 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,900 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.99,320 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,050 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,170 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,900 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,170 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: మీరు తెలివైన వారేనా? అయితే IT రిటర్న్స్ ఫైలింగ్ లో ఈ తప్పులు చేయొద్దు
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,13,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,02, 000 వద్ద కొనసాగుతోంది.