Kakamma Kathalu 2: బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బుల్లితెరకు పోటీగా తెలుగులో ఆహా(Aha)ఓటీటీ వేదికగా ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఆహాలో ఇప్పటికే డాన్సింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలతో పాటు సింగింగ్ కుకింగ్ కార్యక్రమాలు కూడా ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కాకమ్మ కథలు సీజన్ 2(Kakamma Kathalu 2) కూడా ప్రసారమవుతూ మంచి సక్సెస్ అందుకు. ఇప్పటికే ఆరు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీజన్ ఏడవ ఎపిసోడ్ ప్రసారానికి సిద్ధమవుతుంది.
ముందుంది కహానీ…
ఏడవ ఎపిసోడ్లో భాగంగా ఈ కార్యక్రమానికి స్వాతి నాయుడు(Swathi Naidu), బిగ్ బాస్ ఫేమ్ నయని పావని (Nayani Pavani)కూడా హాజరయ్యారు. ఇక వీరిద్దరిని యాంకర్ తేజస్వి మదివాడ బోల్డ్ ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టింది. తాజాగ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. టాలెంట్ అంటే టాలెంట్… అందం అంటే అందం ఇలా దేవుడు ఎవరికి రాయరు లెట్స్ వెల్కమ్ స్వాతి నాయుడు అటు ఆమెను ఇన్వైట్ చేశారు. అలాగే నయిని పావనిని ఇన్వైట్ చేస్తూ… డాన్స్ చేస్తే డాన్సర్, యాక్టింగ్ చేస్తే యాక్టర్.. ఇంకా ముందు ఉంది చాలా కహాని లెట్స్ వెల్కమ్ నయని పావని అంటూ ఈమెకు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఫిమేల్ గొంతుతో పాటలు…
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తేజస్వి మదివాడ వారిద్దరిని కాస్త బోల్డ్ ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టింది. స్వాతి నాయుడు , నయని పావని ఇద్దరూ కూడా తమదైన శైలిలోనే ఆమెకు బోల్డ్ సమాధానాలు చెప్పి కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ తమ లైఫ్ లో ఎదుర్కొన్న కొన్ని కఠిన పరిస్థితులను గురించి కూడా తెలియజేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తేజస్వి శ్వేత సిద్ధార్థ అయ్యుంటే ఏం చేసే వాడివి అంటూ ప్రశ్నించగా ఫిమేల్ గొంతుతో పాటలు పాడే వాడిని అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది.
ఇక నయని పావని కాస్త పవన్ అయితే ఏం చేసే వాడివి అంటూ నయని పావనిని ప్రశ్నించగా ఈపాటికి ఒక 20 మంది అమ్మాయిలను పడేసే వాడిని అంటూ సరదాగా సమాధానం చెప్పారు. ఇక రీల్స్ కోసం ప్రత్యేకంగా లొకేషన్స్ కి వెళ్తాము అంటూ ఇద్దరు సమాధానం చెప్పారు. ఇక బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఈ కార్యక్రమంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక తేజస్వి స్వాతి నాయుడుని ప్రశ్నిస్తూ పెళ్లి చేసుకుంటారా? లేక లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉంటారా? అంటూ ప్రశ్నించడంతో వెంటనే స్వాతి నాయుడు మ్యారేజ్ కు ముందు లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉంటాను అప్పుడే కదా వాడు మ **కాదా అని తెలుస్తుంది అంటూ ఈమె బోల్డ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… అభి ప్రశ్నలా లేక బూతులా అంటూ నెటిజన్స్ తమదైన శైలిలోని కామెంట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జూన్ ఏడో తేదీ ఆహా వీడియో ఇన్ లో ప్రసారం కానుంది.